భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టి 20 మ్యాచ్ లో భారత జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా, ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకుంది. ఎంతో ఉత్కంఠభరితం గా సాగిన ఈ మ్యాచ్ లో కంకషన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రానా కీలకమైన మూడు వికెట్లు తీసుకున్నాడు. దీని పై పెద్ద వివాదం చెలరేగింది
కంకషన్ సబ్ స్టిట్యూట్ నిబంధనల ప్రకారం కొన్ని పరిస్థిబదులు తులలో ఒకరి మరొకరు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఓవర్టన్ బౌలింగ్ లో గాయపడిన శివమ్ దూబే స్థానం లో హర్షిత్ రానా వచ్చాడు. అతని బౌలింగ్ లో ఇంగ్లాండ్ కీలక వికెట్లు కొల్పింది.
నిబంధనల ప్రకారం బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాట్స్ మన్ స్థానంలో బ్యాట్స్ మన్, అల్ రౌండర్ స్థానంలో అల్ రౌండర్ ను తీసుకోవాలి. పరిస్థితిని వివరించి జట్టు యాజమాన్యం మ్యాచ్ రెఫరీని రిక్వెస్ట్ చేయాలి. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ దే తుది నిర్ణయం. ప్రత్యర్థి జట్టుకు దీనిపై అప్పీల్ చేసుకునేందుకు ఎటువంటి హక్కులు ఉండవు.
ఇక్కడ సమస్య ఏంటంటే, మ్యాచ్ జరుగుతోంది ఇండియా లో, మ్యాచ్ రిఫరీ భారత్ కు చెందిన జవగల్ శ్రీనాధ్. శివమ్ దూబే అల్ రౌండర్ కానీ కంకషన్ సబ్ స్టిట్యూట్ గా తీసుకున్న హర్షిత్ రానా నిఖార్సైన ఫాస్ట్ బౌలర్. ఇక్కడే వచ్చింది సమస్య అంతా. అడిగే హక్కు లేదని నిబంధలను అడ్డుపెట్టుకుని జవగల్ శ్రీనాధ్ తీసుకున్న ఈ నిర్ణయానికి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ఈ విషయంపై తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ మాజీ లు కూడా ఈ విషయాన్నీ తప్పు పట్టారు
ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ఈ విషయం పై మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాధ్ స్పష్టత ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు.
ఈ విషయం పై నెటిజెన్ల నుండి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి

