మెగా ఫాన్స్ Vs అల్లు అర్జున్ ఫాన్స్ : మీరు మారరా ?

by | Jan 31, 2025 | ప్రగడ టీవీ

ప్రస్తుతం మెగా ఫాన్స్ కి, అల్లు అర్జున్ ఫాన్స్ కి అసలు పడడం లేదు.  అల్లు అర్జున్ ప్రవర్తన మెగా ఫాన్స్ కు నచ్చడం లేదు.

సోషల్ మీడియా సాక్షిగా నెగటివ్ పోస్ట్ లతో ఇరు వర్గాల వారు చిన్నపాటి యుద్ధం చేసుకుంటున్నారు. 

మెగా ఫాన్స్, అల్లు అర్జున్ ఫాన్స్ – ఇది మీకే

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరో అభిమానులైన తన్నుకుంటున్నారా అంటే అది కేవలం మెగా ఫాన్స్ మరియు అల్లు అర్జున్ ఫాన్స్. ఎంత కాదన్నా ఒకప్పుడు అందరు మెగాభిమానులే.  మీరు ఇలా సోషల్ మీడియాలో నెగటివ్ పోస్ట్ లతో తన్నుకుంటుంటే, మీ హీరోలకు అది అవమానం కాదా.  మహేష్ బాబు ఫాన్స్, ప్రభాస్ ఫాన్స్, తారక్ ఫాన్స్ ఎవరైనా ఇలా చేస్తున్నారా. ఇంకా వీళ్ళందరి ఫాన్స్ మిగతా హీరో ల సినిమాలు విడుదలైనప్పుడు విషెస్ చెపుతారు.  వాళ్ళందరిని స్ఫూర్తి గా తీసుకుని మీరు మారండి

ఏ హీరోలకు లేని ఇగో అల్లు అర్జున్ కు ఉంది అది జగమెరిగిన సత్యం.  ఇండస్ట్రీ అంత మాట్లాడేదే.  అయితే ఇగో నా లేదా మితిమీరిన ఆత్మభిమానమా తెలియదు.  .  ప్రముఖ్హ కమెడియన్ అల్లు రామలింగయ్య గారి మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అయిన అల్లు అర్జున్ కు తన సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనే తాపత్రయం ఉండడంలో ఏ మాత్రం తప్పు లేదు.  అంత మాత్రాన చిరంజీవి గారి విలువ తగ్గిపోదు కదా.  చిరంజీవి గారిని ఏమి అనడంలేదు కదా. జైలు నుండి విడుదల అయ్యాక చిరంజీవి గారి ఇంటికి వెళ్లి వచ్చాడు కదా.  మీ కుటుంబాలలో చిన్న చిన్న కలహాలు రావా,  మీ వాళ్లు మీ మీద అలగరా.  సొంత కుటుంబంలో భార్య, పిల్లలు, తల్లి తండ్రులు, అన్న తమ్ములు, అక్క చెల్లెల్లు మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది అంత పెద్ద మెగా ఫ్యామిలీలో బేదాభిప్రాయాలు రావా. 

చిరంజీవి గారు కూడా కష్టపడి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకుని రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమను దాదాపుగా ఏకచత్రాధిపత్యంతో ఏలారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా  మెగా ఫ్యామిలీ నుండి బయటకు వచ్చి నాకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి అనుకోవడంలో తప్పు ఏంటి.  అల్లు అర్జున్ చిరంజీవి గారితో మాట్లాడకపోయినా, గౌరవం ఇవ్వకపోయినా, చిరంజీవి గారి విలువ తగ్గిపోతుందా…లేదు కదా.  ఎవరి విలువ వారికే

కాబట్టి దయచేసి మెగా ఫాన్స్ కు, అల్లు అర్జున్ ఫాన్స్ కు  ఒక విన్నపం.  మీరు సోషల్ మీడియా సాక్షిగా తన్నుకుని మీ హీరోల పరువు తీయకండి.  వాళ్ళు బాగానే ఉన్నారు.  మీకు తెలియట్లేదు అంతే.  సోషల్ మీడియాలో తన్నుకునే బదులు మీ జీవితాల మీద దృష్టి పెట్టండి

మీరు చేసే పనుల వలన మీరు ఏం సాధిస్తున్నారు.   మీకు తెలియకుండా మీరు మానసిక రుక్మతలకు లోనవుతున్నారు. ఈ విపరీత ధోరణి కొంత కాలానికి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.  ఆలోచించడం మొదలు పెట్టండి.  అనవసరంగా మీరు (అల్లు అర్జున్ ఫాన్స్) మెగా ఫాన్స్ మీద, మెగా హీరోల సినిమాల మీద, మెగా హీరోల సినిమాల కలెక్షన్స్ మీద నెగటివ్ కామెంట్స్ పెట్టకండి.  అలాగే మీరు (మెగా ఫాన్స్), అల్లు అర్జున్ మీద, అల్లు అర్జున్ సినిమాల మీద, అల్లు అర్జున్ సినిమాల కలెక్షన్స్ మీద నెగటివ్ కామెంట్స్ పెట్టకండి.

ఇప్పటికే కొన్ని వెబ్ సైట్స్, యు ట్యూబ్ చానెల్స్ కావాలని మెగా ఫాన్స్, అల్లు అర్జున్ ఫాన్స్  మీద సృష్టిస్తోన్న నెగటివ్ ప్రచారం సరిపోదా.  మల్లి మిమ్మల్ని మీరే దమగె చేసుకుంటారా.  పుష్ప-2 సూపర్ హిట్ అయినా అల్లు అర్జున్ ఎందుకు సెలెబ్రేట్ చేసుకోలేకపోతున్నాడో అందరికి తెలుసు.   కలెక్షన్స్ రికార్డ్స్ శాశ్వతం కాదు.  అమీర్ ఖాన్ దంగల్, ప్రభాస్ బాహుబలి, యశ్ కెజిఫ్, అనిమల్, స్త్రీ 2, పుష్ప-2 రేపు మరో సినిమా.  ఇప్పుడు ప్రాంతీయ సినిమా అనే ఎల్లలు లేవు.  కలెక్షన్స్ రికార్డ్స్ ఎప్పుడు బద్దలవుతూనే ఉన్నాయి.  ప్రభాస్ బాహుబలితో ఎనిమిదేళ్ల క్రితమే 1830 కోట్లు కలెక్షన్స్ కొట్టాడు. ప్రభాస్ ఉంటె చాలు ఎలాంటి సినిమా అయినా 500-600 కోట్లు కలెక్షన్స్ వస్తాయి.  కానీ ప్రభాస్ ఎక్కడైనా రికార్డ్స్ గురించి మాట్లాడడా, ప్రభాస్ ఫాన్స్ ఏమైనా నెగటివ్ పోస్ట్లు పెడుతున్నారా.  రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన దర్శకుడు ఏమైనా మాట్లాడుతున్నాడా, పని చేసుకుంటూ వెళుతున్నాడు కానీ. మరి మీకెందుకు అంత ఆరాటం.

పుష్ప-2 ఇండస్ట్రీ హిట్ అందులో సందేహం లేదు.  గేమ్ చేంజర్ ప్లాప్ అందులో సందేహం లేదు.  బాగున్న సినిమాని ఎవడు ఆపలేదు.  రాజమౌళి, సుకుమార్ ల మొదటి ఇండస్ట్రీ హిట్స్ రామ్ చరణ్ నటించిన మగధీర, రంగస్థలం చిత్రాలే.  అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన పుష్ప-2, అల్లు అర్జున్ పర్సనల్ ఇమేజ్ ని డామేజ్ చేసింది.  ఎంతలా అంటే, అంత పెద్ద హిట్ కొట్టినా, గట్టిగా సెలెబ్రేట్ చేసుకోలేడు, మాట్లాడలేదు. 

ఒక్కటి గుర్తు పెట్టుకోండి.  చిరంజీవి గారు వీటన్నింటిని సహించరు.  హిట్, ప్లాప్ లను సమానంగా తీసుకోగలరు.  కాబట్టే అన్నింటిని తట్టుకుని 46 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఉన్నారు . 70 ఏళ్ళ వయసులో ఈ తరం హీరోలతో పోటీ పడుతున్నారు. అయన బిడ్డగా రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ ప్లాప్ ని హుందాగా తీసుకుంటాడు.  అభిమానులైన మీరే అనవసరంగా సోషల్ మీడియాలో తన్నుకుని మీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు

కెరీర్లో ప్రతి హీరో కి ఎత్తు, పల్లాలు సహజం.  సాటి హీరోల అభిమానులను, హీరోలను చూసి అయినా మీరు (Mega Fans and Allu Arjun Fans) మారండి.