- తండేల్ తరవాత దర్శకుడు చందు మొండేటి సూర్యతో ఒక సినిమా, అల్లు అరవింద్ నిర్మాత గా హిందీ హీరో తో ఒక సినిమా, కార్తికేయ 3 చేయబోతున్నారు
- దాకు మహారాజ్ హిందీ లో చేయాల్సి వస్తే ఆ పాత్రకు సల్మాన్ ఖాన్ సరిపోతాడని హీరోఇన్ ప్రగ్య జైస్వాల్ అంది
- మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం. ప్రయాగ్ రాజ్ సెక్టార్ 22 లో మంటలు
- అమెజాన్ లో మళ్ళీ ఉద్యోగులను తొలగించారు. ముఖ్యం గా కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులను తొలగించారు
- ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు ఫిబ్రవరి 16 న జరగనున్నాయి. ఫిబ్రవరి 19 న ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ప్రారంభమవుతోంది
- ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ కు మాతృ వియోగం
- శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా 232 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 141 పరుగులు, జోష్ ఇంగ్లిస్ 102 పరుగులు చేశారు.
- అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అన్ని ఫార్మట్ లలో కలిపి 700 వికెట్లు తీసుకున్నాడు
- మహాకుంభమేళా లో పూసలు అమ్ముకుంటున్న మోనాలిసా ఫోటోలునెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు, ఆ అమ్మయి కి ఏకంగా బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తీయబోయే ‘ది డైరీ అఫ్ మణిపూర్’ సినిమా కోసం మోనాలిసాను హీరోయిన్ గా తీసుకున్నారు
- రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో, రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు లీక్ అవకుండా, అందరితో Non-Disclosure Agreement చేయించుకున్నాడు రాజమౌళి

