భారత దేశంలో మొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకు వచ్చింది. వాట్సాప్ నెంబర్ : 95523 00009.
మొదటి ఫేజ్ లో 161 రకాల సేవలను అందించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. కీలకమైన శాఖల సేవలను మొదటగా అందించనుంది. రెవిన్యూ, మున్సిపల్, దేవాదాయ, ఇంధన,ఎ పీస్ర్టీసీ శాఖలకు సంబంధించిన సేవలు మొదట ప్రారంభిస్తారు.,
ఈ వాట్సాప్ నెంబర్ (గవర్నెన్స్) ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ప్రజలకు ఈ వాట్స్ అప్ నెంబర్ ద్వారా పంపించవచ్చు. కోట్ల మందికి ప్రభుత్వ పధకాలు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని సునాయాసంగా ఈ వాట్స్ అప్ నెంబర్ ద్వారా చేరవేయవచ్చు
అంతే కాకుండా ప్రజలు తమ విన్నపాలను, ఫిర్యాదులను ఈ వాట్స్ అప్ నెంబర్ ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. వాట్ యాన్ ఐడియా సర్ జి

