విరాట్ కోహ్లీ కాళ్ళు మొక్కిన అభిమాని

by | Jan 30, 2025 | వార్తలు

ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.  12 సంవత్సరాల తరవాత విరాట్ కోహ్లీ రంజీ బరిలో ఢిల్లీ తరపున దిగాడు. 

కోహ్లీ ని చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముంది అని ముందుగానే ఊహించిన ఢిల్లీ క్రికెట్ సంఘం  అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది.

అయితే ఊహించిన దానికన్నా భారీ సంఖ్యలో అభిమానులు రావడం వలన తోపులాట జరిగింది.  దీనిలో కొంతమంది గాయపడ్డారని తెలిసింది. గేట్ లు ఓపెన్ చేసి విషయంలో కొంత గందరకొళం నెలకొనడం వలన కూడా కొంత ఈ పరిస్తితికి దారితీసిందని సమాచారం

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. టాస్ గెలిచినా ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతానికి రైల్వేస్ ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

అయితే ఒక అభిమాని గ్రౌండ్ లో కి వచ్చి విరాట్ కోహ్లీ కాళ్ళకి నమస్కరించాడు.విరాట్ ఆ అభిమానిని పైకి లేపి అలాంటివి చేయద్దనట్లుగా చెప్పాడు.  ఈ లోగా సెక్యూరిటి వారు వచ్చి ఆ అభిమానిని బయటకు తీసుకు వెళ్లారు. 

బీసీసీఐ కఠిన నిబంధనలు తీసుకు వచ్చిన నేపథ్యంలో, సీనియర్ ఆటగాళ్లు సైతం రంజీ బాట పడుతున్నారు.  ఈ ప్రయోగం ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి