వాషింగ్టన్ లో విమానం, హెలికాప్టర్ ఢీ

by | Jan 30, 2025 | వార్తలు

అమెరికాల లోని, వాషింగ్టన్ లో విమానం, హెలికాప్టర్ ఢీ కొట్టుకున్నాయి.  నిన్న రాత్రి 8.30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం లో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.  ఈ ప్రమాదం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా జరిగింది.  ఈ విమానం, హెలి కాఫ్టర్ ధీ కొట్టుకుని పోటోమాక్ నదిలో కూలిపోయాయి.

పీస్ఏ ఎయిర్ లైన్స్, రక్షణ శాఖకు చెందిన హెలీ కాఫ్టర్ ను ఢీ కొట్టింది. దీనితో భారీ శబ్దం వినిపించింది. హెలి కాఫ్టర్ లో ముగ్గురు రక్షణ శాఖకు చెందిన సైనికులు ఉన్నారు.  రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు 

ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది.  తప్పించడానికి అవకాశం ఉంది. అయినా ఎందుకు తప్పించలేదు అని  ఈ ప్రమాదం పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మిలిటరీ హెలికాప్టర్ కు, మీ ముందు విమానం వస్తోందని సమాచారమిచ్చారు. అయినా, అంతా 30 సెకండ్లలోనే జరిగిపోయింది

విమానంలో, హెలి కాఫ్టర్ లో మొత్తం 67 మంది ఉన్నారు.  ఇప్పటికి 18 మృత దేహాలను వెలికి తీశారు