రాజకీయ పార్టీల దగ్గర మూలుగుతున్న 12, 872 కోట్లు

by | Jan 29, 2025 | ప్రగడ టీవీ

రాజకీయ పార్టీ లన్ని మార్చ్ 31, 2024 నాటికి తమ వద్ద ఉన్న నగదు, బ్యాంకు నిల్వలు ఎంత ఉన్నాయో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ నివేదికలను పంపాయి.  ఏ పార్టీ దగ్గర ఎంత డబ్బు ఉందో  చూద్దాం.

కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర 7,113. కోట్ల నిధులు ఉన్నాయి.  ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వద్ద 857 కోట్లు ఉన్నాయి.

ఇక ప్రాంతీయ పార్టీలైన భారస వద్ద 1515 కోట్లు, డీఎంకే వద్ద 515 కోట్ల నిధులు ఉన్నాయి.  టీఎంసీ వద్ద 406 కోట్లు, సమాజ్ వాది పార్టీ వద్ద 394 కోట్లు , తెలుగు దేశం పార్టీ వద్ద 265 కోట్లు, అన్న డీఎంకే వద్ద 262 కోట్లు, వైకాపా వద్ద 67 కోట్ల నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది.

2023-24 సంవత్సరంలో భాజపా చేసిన ఖర్చు 1754 కోట్లు.  దిమ్మ తిరిగిందా. కాంగ్రెస్ చేసిన ఖర్చు సుమారు 617 కోట్లు.

ప్రచారాల కోసం, ఎలక్ట్రానిక్ మీడియా పై భాజపా, కాంగ్రెస్ చేసిన ఖర్చు అక్షరాలా 642 కోట్లు పైనే. కాంగ్రెస్ పార్టీ రెండు విడతల్లో జోడో యాత్రకు చేసిన ఖర్చు సుమారు 122 కోట్లు.

వైకాపా దగ్గర కేవలం 67 కోట్లు మాత్రమే ఉన్నాయట. జనసేన అత్యంత పేద పార్టీ

అన్ని రాజకీయ పార్టీ ల దగ్గర 2023-24 అంతానికి ఉన్న నగదు ఇతర నిల్వల విలువ 12, 872 కోట్లు పైనే

రాజకీయ పార్టీలకు ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో, విరాళాల రూపంలో ఇన్నేసి కోట్లు ఎవరు ఇస్తున్నారు, వాటి ఆర్ధిక స్థితి గతులు ఏమిటి అని ఎవరైనా ఆరా తీయగలరా.

ఇలా అయితే భారత దేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశమే.  మోడీ సైతం డబ్బు లేని రాజకీయం చేయలేరా.