3 వ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం

by | Jan 28, 2025 | వార్తలు

మూడవ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం.  ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలుచుకోవాలన్న భారత ఆశలకు ఇంగ్లాండ్ గండి కొట్టింది.  ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో 2-1 తో నిలిచింది 

వరసగా మూడవ సారి టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు సూర్యకుమార్ యాదవ్.  నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సాల్ట్ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు స్కోర్ బోర్డు ను డకెట్, బట్లర్ ధాటిగా ఆడుతూ పరిగెత్తించారు.  అయితే బట్లర్ 24 పరుగుల వద్ద, డకెట్ 51 పరుగుల వద్ద వెంట వెంటనే అవుట్ అయ్యారు..  చివర్లో, లివింగ్ స్టోన్ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడం వలన ఇంగ్లాండ్ గౌరవప్రదమయిన స్కోర్ చేయగలిగింది

వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను చావు దెబ్బ తీశాడు.  హార్దిక్ పాండ్య రెండు వికెట్లు, బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు

అనంతరం 172 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆది లోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. శాంసన్ 3 పరుగులు, అభిషేక్ శర్మ 24 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు, గత మ్యాచ్ హీరో తిలక్ వర్మ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  భారత జట్టు తరపున టాప్ స్కోరర్, హార్దిక పాండ్య 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ మూడు వికెట్లు, కార్స్, ఆర్చర్ రెండేసి వికెట్లు తీశారు. వుడ్, రషీద్ చెరో వికెట్ తీశారు

వరుణ్ చక్రవర్తి మాన్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగవ టి 20 మ్యాచ్ ఈ నెల 31 న పూణె లో జరగనుంది.