వరసగా మూడవ సారి టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు సూర్యకుమార్ యాదవ్. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సాల్ట్ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు స్కోర్ బోర్డు ను డకెట్, బట్లర్ ధాటిగా ఆడుతూ పరిగెత్తించారు. అయితే బట్లర్ 24 పరుగుల వద్ద, డకెట్ 51 పరుగుల వద్ద వెంట వెంటనే అవుట్ అయ్యారు.. చివర్లో, లివింగ్ స్టోన్ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడం వలన ఇంగ్లాండ్ గౌరవప్రదమయిన స్కోర్ చేయగలిగింది
వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను చావు దెబ్బ తీశాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు, బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు

