పద్మ అవార్డులు సరైన వ్యక్తులకే

by | Jan 28, 2025 | ప్రగడ టీవీ

పద్మ అవార్డులు మీద ఈ సారి కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.  కేంద్ర ఎంపిక చేసే ముందు ఏమేమి అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు అనే విషయం ఎవరికి తెలియవు.  మనకు, వ్యక్తి గతంగా, నచ్చని వ్యక్తికీ అవార్డు వస్తే తట్టుకోలేం, సాధారణ వ్యక్తులు దీనిమీద అనవసర రాద్ధాంతం చేస్తున్నారు

కొంత మంది నాగ ఫణి శర్మ గారికి పద్మశ్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు.  వ్యక్తిగతం గా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కానీ, అసలు అవధానం గురించి తెలుగు రాష్ట్రాల్లో బయట ప్రపంచానికి తెలియచేసిన ప్రముఖులలో నాగ ఫణి శర్మ గారు ఒకరు.  పివి నరసింహారావు గారు కూడా అప్పట్లో అయన అవధానానికి విచ్చేశారు.  గరికిపాటి వారికి కూడా ఈ మధ్యనే పద్మశ్రీ వచ్చింది.  నాగఫణి శర్మ గారు, గారికి పాటి గారి కన్నా ముందే సోషల్ మీడియా ప్రభావం లేని రోజుల్లో పాపులర్ అయ్యారు.  అయన వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు చూసే కన్నా, ఆయనలో ఉన్న ప్రతిభకు ఈ అవార్డు వచ్చిందనుకోవాలి. 

అంతే కాకుండా బాలకృష్ణ పద్మశ్రీ మీద కూడా కొంత మంది మాట్లాడుతున్నారు.  చంద్ర బాబు రికమెండ్ చేసారని.   దానిలో తప్పు ఏముంది, చంద్రబాబు రికమెండ్ చేసారు. కానీ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.  అయన, వ్యక్తి గతం గా బాల కృష్ణ కొన్ని తప్పులు చేయవచ్చు. కానీ 64 సంవత్సరాల వయసులో కూడా, ఈ తరం నాయకులతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు.  అంతే కాకుండా వరసగా మూడు సార్లు హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి ఎం ఎల్ ఎ గా గెలుపొందారు. అంతే కాకుండా బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కూడా.  ఈ హాస్పిటల్ లాభాపేక్ష లేకుండా నడుపుతున్నది.  అటువంటప్పుడు బాల కృష్ణకు పద్మ భూషణ్ ఇవ్వడంలో తప్పు లేదు.

పద్మ అవార్డులను వివాదాల్లోకి లాగొద్దు.  మీ వ్యక్తి గత అభిప్రాయాలను పక్కన పెట్టి సమ దృష్టితో ఆలోచించండి.

ప్రతి విషయాన్నీ విమర్శ కోణంలో చూడకండి. మీరు అవార్డులు ఇచ్చే కమిటీలో ఉంటె, మీకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకోరా, ఇప్పించుకోరా.  అవకాశం లేదు కాబట్టి, ఏదో మాట్లాడాలని మాత్రం మాట్లాడకండి

దేశ వ్యాప్తంగా పద్మ అవార్డులు గెలుచుకున్న అందరికి అభినందనలు