వైస్సార్సీపీ మెయిన్ వికెట్ అవుట్

by | Jan 24, 2025 | రాజకీయాలు

వైస్సార్సీపీ పార్టీ లో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.  ఈ మేరకు ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఘనా విజయం సాధించిన వైస్సార్సీపీ, 2024 లో ఘోర పరాజయం పాలైంది.  కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  పార్టీ శ్రేణులు నిరాశలో మునిగి పోయారు.  ఒక పక్క పార్టీ కి బలం లేకపోవడం, మరో పక్క, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టిస్తున్న తీరు చూస్తుంటే, వైస్సార్సీపీ మనుగడే  ప్రమాదంలో పడేలా ఉంది.  ఇటువంటి పరిస్థితులలో పార్టీ సీనియర్ నేత, విజయ సాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం, వైస్సార్సీపీ కి షాకింగ్ న్యూస్ 

రాజ్య సభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వేరే ఏ పార్టీ లో చేరడం లేదని చెప్పారు. అంతే కాకుండా నన్ను నమ్మి ఆదరించిన వైస్ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పారు.  నాకు  రెండు సార్లు రాజ్య సభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.  అంతే కాకుండా, జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు

అన్ని రకాల సహకారం, ప్రోత్సాహాన్ని అందించిన ప్రధానమంత్రి మోడీకి, హోమ్ మంత్రి అమితాషా కు  ధన్యవాదాలు తెలిపారు.  చంద్రబాబు తో వ్యక్తిగత విబేధాలు లేవు, పవన్ కల్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది అని చెప్పారు.  భవిష్యత్తు అంతా వ్యవసాయం తోనే అని చెప్పారు.

విజయ సాయి రెడ్డి పదవి కాలం 2028 వరకు ఉన్న రాజీనామా చేయడం వైస్సార్సీపీ కి పెద్ద దెబ్బ. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు. అసలే నిరాశలో ఉన్న వైసీపీ శ్రేణులకు, విజయ సాయి రెడ్డి రాజీనామా నిజంగా కోలుకోలేని దెబ్బ

విజయ సాయి రెడ్డి కి బెస్ట్ విషెస్