విజృంభిస్తున్న డొనాల్ద్ ట్రంప్

by | Jan 22, 2025 | వార్తలు

అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టిన  డొనాల్డ్ ట్రంప్ విజృంభిస్తున్నారు.  ఎవరైనా బాధ్యతలు చేపట్టగానే కీలకమైన ఫైల్ పై సంతకం చేస్తారు.  ట్రంప్ ఎన్నికైన మొదటి రోజే అనే కీలక ఆదేశాలు జారీ చేశారు.  వాటిలో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటకు రావడం. కోవిద్ సమయం లో హూ సమర్దవంతంగా పనిచేయలేదని ట్రంప్ అప్పటి ఆరోపణ.  ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా సుమారు 500 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది
  • ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ from హోమ్ విధానాన్ని రద్దు చేసేశారు
  • కాపిటల్ హిల్ పై దాడి చేసిన దోషులకు క్షమా బిక్ష ప్రసాదించారు
  • కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకు, నియామకాలకు ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు
  • వీసా దరఖాస్తులను మరింత నిశితం గా పరిశీలించాలని ఆదేశం. వీసా దరఖాస్తుల పరిశీలనా కఠినతరం చేశారు
  • గత అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేశారు
  • ఏక పక్షం గా ఉన్న పారిస్ ఒప్పందాన్ని రద్దు చేశారు (వాతావరణ మార్పులపై గతం లో కుదుర్చుకున్న ఒప్పందం)
  • ఇంకొక అద్భుతమైన నిర్ణయం ఏంటంటే, వలస వచ్చిన వారికీ పిల్లలు పుడితే వారికి సహజం వచ్చే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు
  • కెనడం మెక్సికో దేశాలకు ఫిబ్రవరి 1 నుండి 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ
  • అంతే కాదండోయ్ అమెరికాను ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ దేశాలనుండి ఎవరు అమెరికా రాకుండా నిషేధం విధించే ఆలోచనలో మన అమెరికా  హిట్ మాన్ ట్రంప్ ఉన్నారు
  • ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఎక్సపెన్షన్ ను నియంత్రిస్తూ బైడెన్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ రద్దు చేశారు
  • ప్రస్తుతానికి భారత్ కు సంబంధించిన సుంకాలపై ఎటువంటి నిర్ణయం తీసుకులోలేదు.
  • అయితే ఎలెక్షన్స్ లో తన డిజిటల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసిన ఎలాన్ మస్క్ కు కూడా ట్రంప్ షాక్ ఇచ్చారు. అదేంటంటే 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని గతం బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ రద్దు చేశారు

దీనిని బట్టి చూస్తే ట్రంప్ ఎంత దూకుడుగా ఉన్నారో తెలుస్తోంది.  వీసా దరఖాస్తుల పరిశీలనా కఠినతరం, పుట్టుకతో పౌరసత్వాన్ని రద్దు చేయడం వంటి అంశాలతో మన భారతీయులు కూడా ఆలోచనలో పడ్డారు.  అమెరికా ఫస్ట్ అనే నినాదం తో ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన ట్రంప్ ఎలాంటి నిర్ణయానికి అయినా వెనుకడుకు వేసేలా లేరు.