125 కోట్ల (షేర్) గేమ్ చేంజర్ ప్లాప్ కు బాధ్యులు ఎవరు

by | Jan 21, 2025 | ప్రగడ టీవీ

ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మించిన 50 వ చిత్రం గేమ్ చేంజర్ కు మొదటి నుండి అన్ని కష్టాలే. ఎట్టకేలకు సినిమా విడుదలైంది.  రామ్ చరణ్ నటనకు పేరు వచ్చింది కానీ సినిమా మీద నెగటివ్ టాక్ తో కలెక్షన్స్  అంత ఆశాజనకంగా లేవు

అయినా గాని ఇప్పటివరకు ఇండియా లో 125 కోట్ల (నెట్) కలెక్షన్స్ ని సాధించింది.  అయినా సరే గేమ్ చేంజర్ ఫ్లాప్ సినిమాల లిస్ట్ లో ఎందుకు వెళ్ళింది. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి, బాద్యులు ఎవరు

సుమారు నాలుగేళ్లు సినిమా షూట్ దశలో ఉండడం. ఈ సినిమా షూట్ జరుగుతూ ఉండగా, శంకర్ మధ్యలో భారతీయుడు-2 మరియు భారతీయుడు-3 ల పని మీద వెళ్లడం.  సోషల్ మీడియా లో వీటి మీద ప్రచారం బాగా జరగడం

గేమ్ చేంజర్ ముందు వచ్చిన శంకర్ భారతీయుడు-2 బెస్ట్ డిసాస్టర్ అవ్వడం 

శంకర్ ట్రాక్ రికార్డు సరిగా లేకపోయినా శంకర్ తో సినిమా తీద్దామని దిల్ రాజు అనుకోవడం (శంకర్ గత మూడు చిత్రాలకు (స్నేహితుడు, ఐ, 2.ఓ) మిక్స్డ్ టాక్ వచ్చింది)

బడ్జెట్ మీద కంట్రోల్ లేకుండా పరిధి దాటి, అనవసర ఖర్చు పెట్టించిన శంకర్, పెట్టిన దిల్ రాజులు ఈ సినిమా పరాజయానికి బాధ్యత తీసుకోవాలి 

ఈ సినిమా మీద నెగటివ్ టాక్ తీసుకు రావాలని కంకణం కట్టుకున్న దురాభిమానులు (కొంత మంది అల్లు అర్జున్ అభిమానులు)

కొంత మంది దురభిమానం తో చేసిన పైరసీ, లోకల్ ఛానల్ లో ప్రసారం చేయడం, సన్నివేశాలను సోషల్ మీడియాలో లీక్ చేయడం  వంటి అంశాలు.

పొలిటికల్ సబ్జెక్టు ని ఎంచుకోవడం, పొలిటిల్ సబ్జెక్టు తో సంక్రాంతి పండగకు రావడం వంటి అంశాలు కూడా ఈ సినిమా పరాజయానికి కారణం

మరి ముఖ్యంగా ఫ్యాన్ వార్.  మెగా ఫామిలీ లో అల్లు అర్జున్ అభిమానులకు మెగా ఫామిలీ కి గ్యాప్ రావడం.  గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు దురభిమానులే ఎక్కువ మంది థియేటర్ లో ఉన్నారు. 

కులం, కమ్యూనిటీ భావనలు, హీరోల మీద వెర్రి అభిమానాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత దేశంలో ఇంకెక్కడా ఉండవేమో.  ఆంధ్ర ప్రదేశ్ కుల రాజకీయాలకు, తెలంగాణాలో సినీ దురభిమానులకు పెట్టింది పేరు అంటే అతిశయోక్తి కాదేమో.

దాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం  సో, సో గా ఉన్నా, సంక్రాంతి కి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవడానికి కారణాలు

పండగ టైం లో కుటుంబ అంత చూసి నవ్వుకునే సినిమా కావడం. 

గేమ్ చేంజర్ మీద నెగటివ్ టాక్ రావడం

కుటుంబ ప్రేక్షకులకు, ఎప్పుడు, బాల కృష్ణ సినిమామొదటి ఛాయస్ కాదు

ఇక మిగిలిన ఏకైక సినిమా సంక్రాంతికి వస్తున్నాం అది కూడా హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తీయడం, హీరో, హీరోయిన్లతో వెరైటీ ప్రొమోషన్స్ వంటి అంశాలు సంక్రాంతికి వస్తున్నాం కు కలిసి వచ్చాయి (సెకండ్ హాఫ్ ఈ సినిమా కూడా నెంబర్ 1 కిచిడి కామెడీ)