దిల్ రాజు ఆస్తుల మీద, ఐటి సోదాలు

by | Jan 21, 2025 | వార్తలు

దిల్ రాజు, ఈ సంక్రాంతికి నిర్మాతగా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలను రిలీజ్ చేశాడు.  అంతే కాకుండా బాల కృష్ణ ‘డాకు మహారాజ్’ ను డిస్ట్రిబ్యూట్ చేశాడు.

వీటిలో దిల్ రాజు నిర్మాతగా తీసిన గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా.  పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు దిల్ రాజు స్వయంగా చెప్పాడు. అంతే కాకుండా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో దిల్ రాజు లెక్కలు వాస్తవానికి దూరం గా ఉన్నాయనేది చాలా మంది భావన.  అంతే కాకుండా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ కూడా అనుమానాస్పదం గా ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య ఐటి వాళ్ళు దిల్ రాజు ఆఫీస్ లో, ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ మధ్యనే దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.  అంతే కాదండోయ్, ఆంధ్ర లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా  ఈవెంట్ లో  తెలంగాణ మీద అనుచిత వ్యాఖ్యలతో దిల్ రాజు వివాదాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఈ సంక్రాంతికి ఐటి వాళ్లు వచ్చారు దిల్ రాజు ఇంటికి.