కింగ్ ఫిషర్ బీర్ ను సప్లై చేసే యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కింగ్ ఫిషర్ బీర్ ను తెలంగాణ లో సప్లై చేయడం ఆపేసింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ మరో 15 రోజులు వరకు సరిపోతాయి. అయితే ఆ తర్వాత కింగ్ ఫిషర్ బీర్ దొరకదు. ఇది బీర్ బాబులకు షాకింగ్ న్యూస్.
బీర్ మార్కెట్ లో కింగ్ ఫిషర్ బీర్ మార్కెట్ షేర్ 70% ఉంది. యునైటెడ్ బ్రూవరీస్ 33% కింగ్ ఫిషర్ బీర్ రేట్ ను పెంచడానికి చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. 33% అంటే,ప్రస్తుతం ఉన్న 150 రూపాయల బీర్ 270 రూపాయలు అవుతుంది. చాలా సంవత్సరాలు సంస్థ బీర్ రేట్లను పెంచకపోవడం వల్ల నష్టాలను చవి చూస్తున్నట్లు తెలిసింది.
ప్రభుత్వం కొత్త లిక్కర్ కంపెనీ లకు ఆహ్వానం పలుకుతోంది. అయితే కింగ్ ఫిషర్ బీర్ కు ఫాన్స్ ఎక్కువ. మన రాష్ట్రం లో వంద మంది బీర్ తాగితే అందులో, 69 మంది కింగ్ ఫిషర్ బీర్ తాగుతున్నారట.
ఈ సమయంలో కింగ్ ఫిషర్ బీర్ సప్లై ఆగిపోతే, నిజంగా బీర్ బాబులకు చేదు వార్త. ఒక రకంగా మంచిదే. తాగడం మానేస్తే ఆరోగ్యాలు బాగు పడతాయి

