గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా వచ్చిన గేమ్ చేంజర్ ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే సినిమా 100 కోట్ల షేర్ సాధించింది. అంతే కాకుండా, రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇప్పుడు ఫోకస్ అంత రామ్ చరణ్ తరవాత సినిమా మీదే ఉంది. మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సన తో రామ్ చరణ్ తన 16 వ సినిమా చేయబోతున్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఘాటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ ఫోకస్ అంత ఈ సినిమా మీదే ఉంది.
అయితే ఈ సినిమా పై జగపతి బాబు ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
చాలా కాలం తర్వాత బుచ్చి బాబు మంచి పని పెట్టాడు. చరణ్ సినిమాలో తన పాత్ర గెట్ అప్ చూశాక చాలా తృప్తి గా ఉంది అని జగపతి బాబు పోస్ట్ చేశారు. జగ్గు భాయ్ పోస్ట్ చేసిన వీడియో మీరు చూసేయండి

