సీనియర్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి, వెంకటెష్, బాల కృష్ణ, నాగార్జున ఇప్పటితరం తో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నారు. వెంకటేష్, నాగార్జున, బాల కృష్ణ ఈ ముగ్గురి వయసు 64/65 సంవత్సరాలు ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మరొక ఆరు నెలలలో 70 సంవత్సరాలు నిండబోతున్నాయి
గత సంక్రాంతి కి నా సామిరంగుతో హిట్ అందుకున్నారు నాగార్జున. ప్రతి సంక్రాంతికి వెంకటెష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక హిట్ సినిమా వస్తోంది. బాల కృష్ణ అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి వంటి వరస హిట్ సినిమాలతో ప్రేక్షకుల అలరించారు.
ఇక మెగా స్టార్ చిరజీవి, రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాలకు వచ్చిన తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.
అయితే ఈ నలుగురు సీనియర్ హీరోలలో, మెగా స్టార్ చిరంజీవి సినిమాలు మాత్రమే 100 కోట్ల షేర్ సాధించాయి. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఈ ఘనతను సాధించాయి. మిగతా సీనియర్ హీరోలలో ఎవరు ఈ ఘనతను సాధించలేదు.
బాల కృష్ణ గత మూడు సినిమాలు 72-78 కోట్ల షేర్ దగ్గర ఆగిపోయాయి. వెంకటేష్ ఎఫ్ 2, 81 కోట్ల షేర్ దగ్గర ఆగిపోయింది.
ఈ ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు ఈ సంక్రాంతికి వస్తున్నాయి. డాకు మహారాజ్ తో బాల కృష్ణ, సంక్రాంతికి వస్తున్నాం తో వెంకటేష్ ఈ సంక్రాంతికి వస్తున్నారు. మరి ఈ సరైన 100 కోట్ల షేర్ మార్క్ అందుకుంటారో లేదో చూడాలి. అల్ ది బెస్ట్ టు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం.

