సంక్రాంతి కి వస్తున్నాం చిత్ర డిజిటల్ ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. అంటే పెద్దోడి సినిమా ట్రైలర్ ను చిన్నోడు రిలీజ్ చేసాడన్నమాట
వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, దిల్ రాజు నిర్మిస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు, మినిమం గ్యారంటీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ, వెంకటేష్ అంటే కుటుంబ కధా చిత్రాలకు పెట్టింది పేరు. వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే

