గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన గేమ్ చేంజర్ సినిమా 10th జనవరి న విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
సినిమా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర బృందం. ఫాన్స్ 256 అడుగుల కట్ అవుట్ తో మొదలై, ట్రైలర్ విడుదల చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కి దగ్గర అవడానికి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ కి రామ్ చరణ్, కియారా అద్వానీలు వెళ్లారు
తెలుగు బిగ్ బాస్ లో లాగే, అక్కడ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక,రామ్ చరణ్, కియారా అద్వానీల చేత కొన్ని టాస్క్ లు చేయించారు సల్మాన్ ఖాన్. ఆర్ ఆర్ ఆర్ కన్నా, గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎక్కువ చేస్తుందని సల్మాన్ ఖాన్ చెప్పారు.
చిరంజీవి ఫామిలీ కి, సల్మాన్ ఖాన్ ఫామిలీ కి మంచి బాండింగ్ ఉంది. చిరంజీవి గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరిశారు కూడా. అంతే కాకకుండా ఒక తెలుగు డైలాగు కూడా చెప్పారు
ఇప్పటికే గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాకుండా తెలుగులో ఇద్దరు సీనియర్ హీరో ల మధ్యన గేమ్ చేంజర్ విడుదలవుతోంది. చూడాలి మరి, విడుదల అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో.

