గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ ని 3-1 తో గెలుచుకున్న ఆస్ట్రేలియా

by | Jan 5, 2025 | వార్తలు

గవాస్కర్, బోర్డర్ ట్రోఫీ ల భాగంగా, భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన, ఆస్ట్రేలియా, గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ ని 3-1 తో గెలుచుకుంది

ఓవర్ నైట్ స్కోర్ 6 వికెట్ ల నష్టానికి 141 పరుగుల తో, ఈ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 157 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.

ఆస్ట్రేలియా బౌలర్ల లో బొలాండ్ 6 వికెట్లు, కమిన్స్ 3 వికెట్లు తీశారు

అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించినా ఆస్ట్రేలియా 58 పరుగుల కు 3 వికెట్లు కోల్పోయింది.  ఈ మూడువికెట్లు ప్రసిద్ కృష్ణ ఖాతాలోకి వెళ్లాయి. ఆ తరవాత ఖవాజా, ట్రావిస్ హెడ్ ధాటి గా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు.  ఖవాజా 41 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతోన్న వెబ్ స్టర్ తో కలిసి ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు.  ట్రావిస్ హెడ్ 34 పరుగులతో, వెబ్ స్టర్ 39 పరుగులతో అజేయంగా నిలిచారు.

మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన బొలాండ్ మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సిరీస్ లో 32 వికెట్లు తీసిన బుమ్రా మాన్ అఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు

రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుండి తప్పుకోవడం, జట్టు పగ్గాలు తీసుకున్న బుమ్రా గాయం తో మైదానం వీడడం, గ్రౌండ్ లో కోహ్లీ నాయకత్వం, సిరీస్ లో ఇప్పటి కే భారత జట్టు వెనుకబడి ఉండడం  వంటి విషయాలు జట్టు ఆటను తీవ్రం గా ప్రభావితం చేశాయి.  ఈ సిరీస్ లో, బుమ్రా 32 వికెట్లు తీశాడు.  బ్యాటింగ్ వైఫల్యాలు భారత విజయావకాశాలను దెబ్బ తీశాయి

భారత్ మొదటి ఇన్నింగ్స్ – రిషబ్ పంత్ 40 | బొలాండ్ 4 వికెట్లు

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్  – వెబ్ స్టర్  57 | ప్రసిద్ద కృష్ణ 3 వికెట్లు

భారత్ రెండవ ఇన్నింగ్స్ – రిషబ్ పంత్ 61 | బొలాండ్ 6 వికెట్లు

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ – ట్రావిస్ హెడ్     |  ప్రసిద్ద కృష్ణ 3 వికెట్లు