భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్ప కూలింది
.భారత జట్టు తన రెండవ ఇన్నింగ్స్ లో 157 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. రిషబ్ పంత్ 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు
ఆస్ట్రేలియా బౌలర్లలో బొలాండ్ 6 వికెట్లు, కమిన్స్ 3 వికెట్లు, వెబ్ స్టర్ ఒక వికెట్ తీశారు
అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ప్రసిద్ద కృష్ణ ఆరంభంలో చావు దెబ్బ తీసాడు.
లంచ్ విరామానికి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది ఖవాజా 19 పరుగులతో, ట్రావిస్ హెడ్ 5 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
భారత బౌలర్లలో ప్రసిద్ద కృష్ణ 3 వికెట్లు తీశాడు.
ఇంకా గెలవాలంటే ఆస్ట్రేలియా 91 పరుగులు చేయాలి. భారత జట్టు గెలవాలంటే 7 వికెట్లు తీయాలి

