గేమ్ చేంజర్ ప్రొమోషన్స్ లో భాగం గా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కు మూడు రోజుల ముందు ఆహాలో స్ట్రీమ్ అవబోతోంది.
జనవరి 2న గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల అయ్యింది. జనవరి 4 లేదా 5 తేదీలలో ప్రీ రిలీజ్ ఈవెంట్. జనవరి 8 న, సాయంత్రం 7 గంటలకు రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవబోతోంది.
ప్రపంచ వ్యాప్తం గా , గేమ్ చేంజర్, జనవరి 10 న విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
సంక్రాంతి కి వస్తున్న గేమ్ చేంజర్ పైన అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల అయ్యాక అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా విజయవంతం కావడం రామ్ చరణ్ కు, దిల్ రాజుకు, శంకర్ కు ఎంతో ప్రత్యేకం

