Breaking : గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్

by | Dec 30, 2024 | వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా దిల్ రాజు నిర్మిస్తోన్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే

ఆదివారం విజయవాడ లో జరిగిన 256 అడుగుల రామ్ చరణ్ కట్ అవుట్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ట్రైలర్ జనవరి 1 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  అంతే కాక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్ర ప్రదేశ్ లో చేస్తున్నామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నామని చెప్పారు

ఈ రోజు నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారిని కలిసి,  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావలసిందిగా కోరారు.  అందుకు పవన్ కల్యాణ్ గారు సమ్మతించారని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

గ్లోబల్ స్టార్ అభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందని చెప్పవచ్చు