రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి 10 న విడుదల అవుతున్నట్లు మనందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు కు 50 వ చిత్రం. రామ్ చరణ్ కు జోడి గ కియారా అద్వానీ నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి
ఈ మధ్యనే డల్లాస్ లో మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది అయితే ప్రొమోషన్స్ స్పీడ్ పెంచాలని, ట్రైలర్ ని తొందరగా రిలీజ్ చేయాలనీ అభిమానులు భావిస్తున్నారు.
ఈ లోగా అభిమానులు చిత్ర ప్రొమోషన్స్ ని భుజాలకెత్తుకున్నారు. దీనిలో భాగంగా విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ భారీ కట్ అవుట్ ని ఏర్పాటు చేశారు
ఇంత భారీ కట్ అవుట్ ని ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి దీనిని ఏర్పాటు చేసిన రామ్ చరణ్ యువశక్తి సభ్యులు చెప్పుకొచ్చారు
ప్రగడ టీవీ, రామ్ చరణ్ యువ శక్తి సభ్యులను అభినందిస్తూ, గేమ్ చేంజర్ కు బెస్ట్ విషెస్ ను తెలియచేస్తోంది

