భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి, ఆస్ట్రేలియా జట్టు తన రెండవ ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్ఠానికి 228 పరుగులు చేసింది.
173 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును లియాన్, బొలాండ్ లు 10 వ వికెట్ కు అజేయం గా 55 పరుగులు చేసి ఆదుకున్నారు. లియాన్ 41పరుగులతో, బొలాండ్ 10 పరుగులతో అజేయంగా నిలిచారు
తీవ్రంగా శ్రమించిన భారత బౌలర్లు, ఆస్ట్రేలియా జట్టు ఆఖరి వికెట్ తీయలేకపోయారు. బుమ్రా నో బాల్స్ కొంప ముంచాయి.
భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు.
మూడవ టెస్ట్ కు రేపు ఆఖరు రోజు. ఆస్ట్రేలియా ఇప్పటికే 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. రేపు ఒక్క రోజులో భారత జట్టు గెలవాలంటే, ఆస్ట్రేలియా జట్టు ఆఖరు వికెట్ పడగొట్టాలి. అంతే కాకుండా 333 పరుగులను వికెట్లు కాపాడుకుంటూ చేధించాలి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేస్ లో నిలబడాలంటే ఈ టెస్ట్ గెలవడం భారత జట్టుకు చాలా ముఖ్యం

