గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ సాంగ్ రిలీజ్ ఈ శనివారం

by | Dec 18, 2024 | సినిమా

గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరో గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

పుష్ప-2 తరవాత వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ నుండి నాల్గవ సాంగ్ ‘ధోప్’ ఈ నెల 21 న విడుదల అవుతోంది.  దీనికి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ విడుదల చేశారు

దిల్ రాజు నిర్మిస్తోన్న గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

శంకర్ భారీతనం, థమన్ బీట్స్, రాంచరణ్ డాన్స్ తో ఈ సాంగ్ ఈ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెపుతున్నారు

మొదటి మూడు పాటలు ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యిన సందర్భంగా ఈ “ధోప్” సాంగ్ హిట్ అయ్యితే అడ్వాన్స్ బుకింగ్స్ జోరు పెరుగుతుంది.

అమెరికాలోని డల్లాస్ లో ‘ధోప్’ సాంగ్ ను ఈ నెల 21 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు

ఈ రోజే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం చేశారు