తెలుగు సినిమా రేంజ్ యావత్ భారతదేశానికి షాక్ ఇస్తోంది. ఎప్పుడైతే Bahubali సినిమా బాలీవుడ్ ని షేక్ చేసిందో అప్పట్నుంచీ తెలుగు సినిమాకి ఆదరణ పెరిగిపోయింది. అంతేకాదు, సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ కూడా సినిమాకి హైప్ ని ఇస్తోంది. కలక్షన్స్ వర్షం కురిసేలాగా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గత 5 సినిమాల కలక్షన్స్ , అలాగే రామ్ చరణ్ గత 5 సినిమాల కలక్షన్స్ ని ఒక్కసారి చూసినట్లయితే..,
ఫస్ట్ రామ్ చరణ్ శ్రీను వైట్ల తీసిన బ్రూస్ లీ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. 62 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.60 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. కానీ, భారీ లాస్ ని మూటగట్టుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, అలాగే ఎగ్జిబిటర్స్ కూడా బాగా నష్టం చవిచూశారు. ఈసారి రామ్ చరణ్ తన నెక్ట్స్ సినిమా కూడా వారికే తక్కువ రేటుకి ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత రామ్ చరణ్ ధృవ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.87 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అందరికీ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కి సోలోగా మార్కెట్ ఏర్పడింది. అంతకు ముందు కేవలం మగధీర మాత్రమే సూపర్ గ్రాండ్ సక్సెస్ ఉన్న రామ్ చరణ్ కి ధృవ సినిమా ఊపిరి పోసింది. వరుస ఫ్లాప్స్ ని ఎదుర్కున్న చరణ్ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ లో కూడా మార్క్ ని క్రియేట్ చేశాడు. ఈసినిమా తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం ఇండస్ట్రీని షేక్ చేసింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, సమంత గ్రేస్ ఫుల్ గ్లామర్ తోడై ఏకంగా ఫుల్ రన్లో 216 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఒక్కసారిగా సూపర్ డూపర్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు, ఈసినిమా తన యాక్టింగ్ లో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. రామ్ చరణ్ చిట్టిబాబు గా చేసిన యాక్టింగ్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. దీంతో సోలోగా తన మార్కెట్ రేంజ్ ని వరల్డ్ వైడ్ 200కోట్ల క్లబ్ ని దాటించాడు రామ్ చరణ్.
ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో తీసిన వినయ విధేయ రామ అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ, సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కలక్షన్స్ ప్రకారం చూస్తే పాసైపోయింది. 65కోట్లతో తీసిన ఈ సినిమా ఫుల్ రన్ అయ్యేసరికి 94కోట్ల గ్రాస్ ని కలక్ట్ చేసింది.
ఆ తర్వాత రామ్ చరణ్ – ఎన్టీఆర్ చేసిన ట్రిబుల్ ఆఱ్ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తీసిన ఈ సినిమా యావత్ ఇండస్ట్రీని షేక్ చేసింది. 550 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఫుల్ రన్లో 1387 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచింది. నెక్ట్స్ వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఏ రేంజ్ లో కలక్షన్స్ ని రాబడుతుందో చూడాలి..
ఇక ఎన్టీఆర్ గత 5 సినిమాల కలక్షన్స్ చూసినట్లయితే..,
జనతాగ్యారెజ్ సినిమా ఎన్టీఆర్ లోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకి చూపించింది. మైత్రీ మూవీ మేకర్స్ లో వచ్చిన ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.153 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ 100కోట్ల మార్క్ ని అందుకునేలా చేసింది. ఈ సినిమా ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాని చూపించింది.
ఆ తర్వాత బాబీ డైరెక్షన్ లో వచ్చిన జైలవకుశ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిబుల్ యాక్షన్ తో ప్రేక్షకులని అబ్బురపరిచాడు. దీంతో బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఎన్టీఆర్ బ్యానర్ పై కేవలం 45కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 150కోట్లు ఫుల్ రన్ లో గ్రాస్ కలక్షన్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయింది.
నెక్ట్స్ త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తీసిన సినిమా అరవింద సమేత. ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో తెరకెక్కింది. 60కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 165కోట్లు కలక్ట్ చేసిన బాక్సాఫీస్ దగ్గర మంటలు రేపింది. ఇక ఈసినిమా తర్వాత ఎన్టీఆర్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే జక్కన్న ట్రిబుల్ ఆర్ మూవీ ఎనౌన్స్ చేశాడో అప్పట్నుంచీ మేకోవర్ చేశాడు తారక్. 550కోట్లతో నిర్మించిన ట్రిబుల్ ఆర్ సినిమా ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1387 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది.
ఈసినిమా తర్వాత దేవర పార్ట్ 1తో తారక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యువసుధా ఆర్ట్స్ లో నిర్మించిన ఈసినిమాకి 200కోట్లు ఖర్చుపెట్టారు. ఫస్ట్ టైమ్ తారక్ సినిమాకి ఇంత హ్యూజ్ బడ్జెట్ కేటాయించారు. ఇక ఈసినిమా ఫుల్ రన్ ముగిసేసరికి 521కోట్ల గ్రాస్ ని కలక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినాని చూపించింది. మొత్తానికి ఒఖవైపు రామ్ చరణ్, మరోవైపు తారక్ ఇద్దరూ కూడా తమ కెరియర్ లో కలక్షన్స్ ని పెంచుకుంటూ వచ్చారు. మరి ఈసారి బాక్సాఫీస్ ని ఎవరు షేక్ చేస్తారనేది చూడాలి.

