కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా.. హరీష్ రావ్ పయనం ఎటువైపు!

by | Dec 17, 2024 | రాజకీయాలు

కల్వకుంట్ల కవితి కేసీఆర్ కూతురు కొత్తపార్టీ పెట్టబోతోందా అంటే నిజమే అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇప్పుడున్న సమయంలో కొత్తపార్టీ అవసరమా… పార్టీ పెడితే ఏమవుతుంది. తనపైన ఉన్న కేసులు సంగతేంటనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఎందుకు వినిపిస్తోంది. కవిత కొత్తపార్టీ పెడితే హరీష్ రావు పయనం కూడా అటువైపేనా.. ఇంట్రస్టింగ్ టాపిక్ ని చివరి వరకూ స్కిప్ చేయకుండా చూడండి…

లిక్కర్ స్కాం లో జైల్లో గడిపిన తర్వాత కవిత కమ్ బ్యాక్ అదిరిపోయింది. జాగృతితో పిలుపునిస్తూ లీడర్స్ ని ఒకటిగా తీస్కుని వచ్చింది. రీసంట్ గా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి అంటూ విమర్సిస్తూ పదునైన బాణాలు ఎక్కుపెట్టింది. బతుకమ్మ ఎమోషన్ ని మరోసారి ప్రజలకి గుర్తుచేసేలా మాట్లాడింది. తెలంగాణ తల్లి చీర రంగు, అభయహస్తం ఇవన్నీ కూడా కాంగ్రెస్ తల్లిలా ఉందని, అందులో మన కల్చర్ అయిన బతుకమ్మలేదని విమర్శించింది. దీంతో అన్ని మీడియా ఛానల్స్ లో హైలెట్ అయ్యింది. అంతేకాదు, కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వీరందరూ కూడా పాల్గొన్నారు. ఇక బీఆర్ యస్ నాయకులపై కేసులు పెడితే ఊరుకోమని స్ట్రాంగ్ గా హెచ్చరికలు జారీచేసింది. కేసీఆర్ ని మొక్క అని అనుకోవద్దని, ఆయన వేగు చుక్క అంటూ పంచ్ డైలాగ్స్ తో సమాధానం ఇచ్చింది. ఇవన్నీ కూడా కవిత నిత్యం న్యూస్ లో ఉండేలా చేస్తున్న అంశాలు. ఇదే సమయంలో ఆమె కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతోందని అందుకే అన్నింటిలోనూ యాక్టివ్ గా ఉంటోందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఇప్పుడు తిట్లతోనే పరిపాలన చేస్తున్నారని, రేవంత్ రెడ్డి గురువులకే చుక్కులు చూపించిన శక్తి తెలంగాణా ప్రజలకి ఉందని ఎద్దేవా చేస్తూ డైరెక్టర్ గా ముఖ్యమంత్రికే సవాళ్లు విసురుతోంది కవితక్క. జాగృతి అనే పేరుతోనే పార్టీని స్థాపించాలని ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. అయితే, కవిత పార్టీకి హరీష్ రావ్ మైయిన్ పిల్లర్ గా ఉండబోతున్నారా అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, ప్రస్తుతం బీఆర్ యస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు హరీష్ రావ్ ఇంకా కేటీఆర్. ఇప్పుడు సపరేట్ పార్టీ పెడితే ఓట్లలో చీలికలు, పార్టీలో విభేదాలు ఖచ్చితంగా వస్తాయ్. అంతేకాదు, ప్రస్తుతం కవిత పార్టీ పెడితే మరో షర్మిళ పార్టీలాగానే ఉంటుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎపిలో షర్మిళ ఇలాగే జగన్ ని కాదని కొత్తపార్టీకి శ్రీకారం చుట్టింది. తీరా చూస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు కవిత పరిస్తితి కూడా మరో షర్మిళలాగా అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని నెలలుపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత, మళ్లీ రాజకీయాల్లో తన మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నారు.  అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు కవిత క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇదే ఊపులో సొంత పార్టీ పేరు , సింబల్ కూడా ఎనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో కేడర్‌తో సమావేశాలు నిర్వహించి, వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు.

జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్ కమిషన్ వినతిని అందించారు.  రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, సంబంధిత రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కవిత రాకతో పార్టీ కేడర్ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో కొత్త పార్టీ అంటే కొంతమంది వద్దని వారిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు కవిత పార్టీ పెడితే హరీష్ రావు నిర్ణయమే కీలకం అని చాలామంది అభిప్రాయం. అదీ విషయం.