మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ మధ్య దూరం రోజు, రోజుకి పెరుగుతోందా…!!!

by | Dec 12, 2024 | సినిమా

గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అల్లు కాంపౌండ్, మెగా కాంపౌండ్ నుండి వేరు పడినట్లే అని అనిపిస్తోంది.

పైకి చెప్పకపోయినా, అడపా దడపా మెగా ఫామిలీ ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ ఉన్న ఫోటోలను విడుదల చేసినా, వాస్తవానికి మెగా కాంపౌండ్ నుండి బయటకు రావాలని అల్లు అర్జున్ కి ఉన్నట్లు అనిపిస్తోంది. మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చి తనకు అంటూ ఒక సొంత ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవాలని అల్లు అర్జున్ తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తన అభిమానులను ప్రత్యేకంగా అల్లు ఆర్మీ అని పిలుస్తూ ఉంటాడు. ఈ విషయంతో నే కొంత అర్ధం అయ్యింది. గతంలో ‘చెప్పను బ్రదర్’ అనే మాటతో ఎంత దుమారం రేగిందో చెప్పనవసరం లేదు.

అలీతో సరదాగా షో లో రెండేళ్ల క్రితం ఈ వివాదం గురించి అలీ అడిగిన ఒక ప్రశ్నకు అల్లు అరవిందగారు చెప్పిన సమాధానం ఏంటంటే 1980, 90 లలో చిరంజీవి గారు, నేను బావ, బావమరుదులుగా కాకుండా స్నేహితులులాగా ఎదిగాం. ఇప్పుడు ఇద్దరి ఫ్యామిలీలు పెరిగాయి. పోటీ ప్రపంచంలో ఉన్న అవకాశాలను అంది పుచుకుని ఎదగాలి ఎవరైనా అని సింపుల్ గా చెప్పారు.

కానీ రెండేళ్ల తరవాత మెగా ఫ్యామిలీ అంతా ఒకటేనని అల్లు అర్జున్ చెప్పగలడా అనేది వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్న.

అంతే కాకుండా మొన్న ఆ మధ్య అల్లు అర్జున్ ఆఫీస్ లో సౌత్ సూపర్ స్టార్స్ ఫోటోలలో చిరంజీవి గారి ఫోటో లేదని ఎవరో అన్నారు. ఒకవేళ అదే నిజమైతే అది బాధాకరం. దీనితో అల్లు అర్జున్ మనసులో ఏముందో అర్ధం అవుతుంది.

బాలకృష్ణ చేస్తున్న ఆహ వారి అన్ స్టాప్పబుల్” సీజన్ 4 నడుస్తోంది. చిరంజీవి వస్తాడని గత సీజన్లలో ఎన్నో సార్లు ప్రచారం జరిగినా ఇప్పటి వరకు చిరంజీవి రాలేదు.

బాలకృష్ణ చేస్తున్న ఆహ వారి అన్ స్టాప్పబుల్” సీజన్ 4 ఈ సారి అల్లు అర్జున్ ఎపిసోడ్లు రెండు చేశారు. ఆ షో బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ అని, ఆహ లో అల్లు అరవింద్ గారు కూడా ఒక భాగస్వామి అన్న విషయం అందరికి తెలిసిందే.

రెండు ఎపిసోడ్ లు చేసిన ఈ షో లో కనీసం మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ ల మధ్య వచ్చిన గ్యాప్ గురించి కానీ, బాండింగ్ గురించి కానీ బాలకృష్ణ ఒక ప్రశ్న కూడా సంధించలేదు. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ ల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అని చెప్పడానికి అల్లు అర్జున్ కి ఇది సరైన వేదిక. కానీ ఆ ప్రయత్నం చేయలేదు.

అయితే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్స్ అంతగా ప్రజాదరణ పొందలేదని తెలుస్తోంది. ప్రభాస్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా ప్లాట్ఫారం సర్వర్స్ డౌన్ అయ్యాయి. ఆ రేంజ్ స్పందన, అంటే నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్ లో అల్లు అర్జున్ ఎపిసోడ్ లకు రాలేదు.

మెగా కాంపౌండ్ నుండి బయటకు రావాలి అని అనుకోవడం తప్పు కోలేదు. అయితే అల్లు అర్జున్ ఆటిట్యూడ్ చాలామంది కి నచ్చట్లేదు. అయితే అల్లు అర్జున్ ఆటిట్యూడ్ చాలామంది కి నచ్చట్లేదు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ఇప్పటివరకు తెలుగులో ఎవరికీ రాలేదని తెలిసాక, నేను దీనిని కొట్టాలి అని అనుకున్న విషయాన్నీ అవార్డు వచ్చాక చెప్పడం లో ఆటిట్యూడ్ కనపడుతోంది.

ఇప్పటికే అల్లు అర్జున్, పుష్ప – 2 తో 1000 కోట్ల మార్క్ ను దాటి, ప్రభాస్, రామ్ చరణ్, తారక్ ల సరసన నిలిచాడు. అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఆటిట్యూడ్ స్టార్ అయిపోయాడు. ఇప్పటికే ఫ్యాన్ వార్ సోషల్ మీడియా లో మొదలైంది. మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ను వేరు చేసి పోస్ట్ లు పెడుతున్నారు.

రాజమౌళి, ప్రభాస్ పుణ్యమా అని హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టారు. ఎవరి సంపాదన వారిది, ఎవరి సినిమాలు వాళ్ళవి, ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు అందరి హీరోలతో సినిమా చేస్తాయి. కాంపౌండ్ ఏదైనా ముందుగా అందరు తెలుగు సినిమా హీరోలు.

మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ ల మధ్య నిజానికి ఎలాంటి, ఎంత గ్యాప్ ఉందొ తెలియదు కానీ, మెగా ఫాన్స్, అల్లు ఆర్మీ మధ్య గ్యాప్ అయితే సోషల్ మీడియా సాక్షి గా మొదలైంది.

పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక మైత్రి మూవీస్ రవిశంకర్, నవీన్ గార్లు, దర్శకుడు సుకుమార్ తో కలిసి చిరంజీవి ని కలిశారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ వారి వెంట వెళ్ళలేదు.

అల్లురామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు చిరంజీవి అల్లుడు చేసుకోవాలనుకున్నారు కానీ, చిరంజీవి అల్లురామలింగయ్య గారి అల్లుడు అవ్వాలని అనుకోలేదు. చిరంజీవి హీరో గా సక్సెస్ కావడానికి స్వతహాగా కమెడియన్ అయినా అల్లురామలింగయ్య గారి ఇమేజ్ ఎంత వరకు ఉపయోగపడిందో ఆ దేవుడికే తెలియాలి. కానీ అల్లు అర్జున్ హీరో గా ఎంట్రీ ఇంచేనాటికి చిరంజీవి కి , మెగాస్టార్ స్థాయిలో ఉన్నారు. నేపోటిజం అల్లు రామలింగయ్య గారు – చిరంజీవి కాంబినేషన్, చిరంజీవి – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఏ స్థాయిలో ఉందొ దీనినిబట్టి అందరికి అర్ధమవుతుంది.

పుష్ప 2 కంటెంట్ మీద అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ వారికి నమ్మకం లేదనుకుంటా. అందుకే సినిమాని భారీస్థాయిలో రిలీజ్ చేసి, ఆకాశానికి అంటేలా టికెట్ ధరలు పెంచేసి కలెక్షన్స్ రికార్డు లతో హైప్ క్రియేట్ చేశారు. పుష్ప 2 చూసిన వాళ్లలో ఎక్కువ శాతం పుష్ప పార్ట్ 1 బావుంది అన్నారు. పార్ట్ 2 బోరింగ్ అని, వన్ టైం వాచ్ అని అన్నారు.

కంటెంట్ తో వ్యక్తిత్వాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి.

మెగా కాంపౌండ్ నుండి బయటపడి తనకంటూ ఒక సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలనే తపన ఉండడం మంచిదే కానీ, అల్లు అర్జున్ కి సూపర్ స్టార్ స్టేటస్ రావాలి అంటే కంటెంట్, కధల మీద దృష్టి పెట్టాలి. క్యారెక్టర్ ఎలేవేషన్స్, హైప్ మీద కాదు. అలాగే ప్రభాస్ లాగా అందరికి డార్లింగ్ అయ్యేలా ఉంటె ఏ సమస్యలు ఉండవు.