బాహుబలి-2 వసూళ్ల కన్నా పుష్ప-2 వసూళ్లు తక్కువే. బయటకి వస్తోన్న నిజాలు
పుష్ప-2 (Pushpa) సినిమా విడుదలైన దగ్గర నుండి అనేక రకాలుగా వార్తల్లో నిలిచింది. పుష్ప-2 సినిమా థియేటర్ లో పెద్ద హిట్ అయిందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో మొదటి నుండి గందరగోళం ఉంది. ఎంతలా అంటే ఈ సినిమా వసూళ్ల విషయంలో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితి.
పుష్ప-2 సినిమా వసూళ్ల పరంగా హిట్ అయినా ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ (Allu Arjun) , ఒక రాత్రి జైలు లో ఉండాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళా ప్రాణాలు కోల్పోయింది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడిన మాటలకూ అల్లు అర్జున్ కౌంటర్ ప్రెస్ మీట్ లు కూడా అల్లు అర్జున్ కు ప్రతికూలంగానే మారాయి.
అయితే ప్రస్తుతం నిజ నిజాలు అన్ని బయటకు వస్తున్నాయి. టికెట్ రేట్లు భారీగా పెంచుకుని లబ్ది పొందిన పుష్ప-2 వసూళ్ల విషయంలో 2017 లో సాధారణ టికెట్ రేట్లతో వచ్చిన బాహుబలి-2 వసూళ్లను అందుకోలేకపోయింది. ఇప్పుడు వాస్తవాలు ఎలా బయటికి వచ్చాయి అంటే, ప్రస్తుతం భారత దేశంలో దురంధర్ (Durandhar) ప్రభావం గట్టిగానే ఉందని చెప్పవచ్చు
ప్రస్తుతం దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు లు నెలకొల్పుతున్న సమయంలో అందరు టాప్ 10 అత్యధిక వసూళ్ల చిత్రాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో, అనేక రకాల లెక్కల ప్రకారం పుష్ప-2 వసూళ్లు బాహుబలి-2 వసూళ్లను దాటలేదని తెలుస్తోంది.
Eenadu Website లో వచ్చిన కధనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాను చూద్దాం
2016 లో వచ్చిన దంగల్ 1968 కోట్ల తో మొదటి స్థానంలో ఉంది. 1810 కోట్లతో బాహుబలి 2 రెండవ స్థానంలో, 1666 కోట్లతో దురంధర్-2 మూడవ స్థానంలో, 1642 కోట్లతో పుష్ప-2 నాలుగవ స్థానములో, 1350 కోట్ల తో దురంధర్ ఐదవ స్థానంలో 1300 కోట్లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆరవ స్థానంలో, 1200 కోట్లతో కె జి ఎఫ్ ఏడవ స్థానంలో, 1148 కోట్లతో జవాన్ ఎనిమిదవ స్థానంలో,1050 కోట్లతో పఠాన్ తొమ్మిదవ స్థానంలో,1042 కోట్లతో కల్కి పదవ స్థానంలో ఉన్నాయి
మనీ కంట్రోల్ (Money Control) కధనం ప్రకారం వసూళ్ళలో కొంత వ్యత్యాసం ఉన్నా, పుష్ప-2 వసూళ్లు మాత్రం బాహుబలి-2 వసూళ్ల కన్నా తక్కువే.
అలాగే గ్రేట్ ఆంధ్ర (Greatandhra)లో వచ్చిన కధనం ప్రకారం కూడా వసూళ్ల అంకెలలో వ్యత్యాసం ఉన్నా పుష్ప-2 వసూళ్లు, 2017 లో వచ్చిన బాహుబలి-2 వసూళ్ల కన్నా తక్కువే అని తేలింది.
ఇప్పటికైనా హీరోలను లేదా అభిమానులను సంతోష పెట్టడానికి, నిర్మాతలు తప్పుడు లెక్కలను చూపించకూడదు. ఏది ఏమైనా 2017 లో తెలుగు సినిమా గతిని మార్చిన బాహుబలి-2 సినిమా వసూళ్లను 2024 లో టికెట్ రేట్ లను భారీగా పెంచుకుని లబ్ది పొందిన పుష్ప-2 సినిమా అధికమించలేదు అనే విషయం స్పష్టమైంది
పుష్ప-2 వసూళ్లు నార్త్ బెల్ట్ లో ఎక్కువగానే ఉన్నా, సగటు తెలుగు అభిమానికి మాత్రం పుష్ప-2 కన్నా పుష్ప మొదటి భాగమే బావుంది అనే వాళ్ళు లేకపోలేదు

