T20 World Cup – Super 8 – India Vs South Africa : భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు పై, సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా భారీ అంతరం ఉండడంతో, ఈ ఓటమి భారత జట్టు నెట్ రన్ రేట్ పడే అవకాశం ఉంది. భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ కూడా, ఈ రోజు మధ్యాన్నం శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల జరిగిన మ్యాచ్ తరహాలోనే సాగింది. శ్రీ లంక 51 పరుగుల తేడాతో ఓడిపోతే, భారత జట్టు 76 పరుగుల తేడాతో ఓడిపోయింది
భారత జట్టు ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్, రింకు సింగ్, బుమ్రా డక్ అవుట్ (Ishan Kishan, Rinku Singh, Bumra)
188 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు మొదటి ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరం ఇషాన్ కిషన్ ను డక్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు
రెండవ ఓవర్ మొదటి బంతికే తిలక్ వర్మ ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఎట్టకేలకు ఈ వరల్డ్ కప్ లో పరుగుల ఖాతా ఓపెన్ చేసిన అభిషేక్ శర్మ తడబడుతూనే 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ వచ్చిన సుందర్ 11 పరుగులు, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు
51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును హార్దిక్ పాండ్య, దూబే లు ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఆరవ వికెట్ కు 35 పరుగులు జోడించారు. అయితే హార్దిక్ పాండ్య 18 పరుగుల వద్ద ఒక భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద స్టబ్స్ అద్భుతమైన క్యాచ్ పట్టడం తో అవుట్ అయ్యాడు.
ఒకే ఓవర్. మూడు వికెట్లు. ఒకే తరహా మూడు క్యాచ్ లు (Keshav Maharaj)
కేశవ్ మహారాజ్ వేసిన ఇన్నింగ్స్ 15 వ ఓవర్ లో భారత జట్టు రెండు పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మూడు క్యాచ్ లు లాంగ్ ఆఫ్ లో స్టబ్స్ అందుకోవడం విశేషం. హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అర్ష్ దీప్ సింగ్ లు ఒకే విధంగా అవుట్ అవడం విశేషం. రింకు సింగ్ డక్ అవుట్ అవగా, అర్ష్ దీప్ సింగ్ ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. స్టబ్స్ రెండు క్యాచ్ లను బౌండరీ లైన్ అవతల అందుకుని, గాల్లోకి విసిరి బౌండరీ లైన్ ఇవతలకు వచ్చి అందుకున్నాడు. ఈ ఓవర్ తో మ్యాచ్ స్వరూపం ఒక్క సారిగా మారిపోయింది
37 బంతుల్లో 42 పరుగులు చేసిన శివమ్ దూబే భారత జట్టు ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. దూబే ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. చివరకు 18.5 ఓవర్ల లో 111 పరుగులకు అల్ అవుట్ అయిన భారత జట్టు 76 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది
సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జన్సెన్ నాలుగు వికెట్లు తీసుకోగా, కేశవ్ మహారాజ్ ఒకే ఓవర్లో మూడు వికెట్ లు తీసుకున్నాడు. బాష్ రెండు వికెట్లు తీసుకోగా, కెప్టెన్ మార్కరం ఒక వికెట్ తీసుకున్నాడు. వికెట్ లు తీసుకోక పోయినా, సౌత్ ఆఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి నాలుగు ఓవర్ల లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్టార్ పేసర్ రబడా కు ఒక వికెట్ కూడా దక్కలేదు
అంతకు ముందు టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
భారత పేసర్ల ధాటికి సౌత్ ఆఫ్రికా 20 పరుగులకే మూడు కీలక వికెట్ కు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది.
డికాక్ 6 పరుగులు, మార్కరం 4 పరుగులు, రికెల్టన్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన బ్రెవిస్, మిల్లర్ లు ఆచి తూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ లు బాదుతూ స్కోర్ బోర్డు ను కదిలించారు. వీరిద్దరూ, నాలుగవ వికెట్ కు 97 పరుగులు జోడించారు.
బ్రెవిస్ 29 బంతుల్లో 45 పరుగులు ( మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన స్టబ్స్ తో కలిసి మిల్లర్ 35 పరుగులు జోడించాక, 35 బంతుల్లో 63 పరుగులు ( 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసిన మిల్లర్ అవుట్ అయ్యాడు.
మిల్లర్ అవుట్ అయ్యాక స్టబ్స్ ఒంటరి పోరాటం చేసి 24 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. హార్దిక పాండ్య వేసిన ఆఖరి ఓవర్లో స్టబ్స్ 20 పరుగులు రాబట్టాడు
భారత బౌలర్లలో బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి, నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి, మూడు కీలక వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్ కూడా రెండు వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే లు ధారాళంగా పరుగులు ఇచ్చి చెరో ఒక వికెట్ తీసుకున్నారు

