T20 World Cup : సొంతగడ్డపై శ్రీలంక కు ఘోర పరాజయం

by | Feb 22, 2026 | క్రీడలు

T20 World Cup – Super 8 : సొంతగడ్డపై శ్రీలంక కు ఘోర పరాజయం ; 51 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతి లో ఓడిన శ్రీలంక

శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

147 పరుగుల లక్ష్యం తో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీ లంక క్రమం తప్పకుండా వికెట్ లు కోల్పోతూ వచ్చింది.  శ్రీలంక జట్టు ఒకానొక దశలో 34 పరుగులకే ఐదు వికెట్ లు కోల్పోయింది.

టాప్ ఆర్డర్ ఆటగాళ్లు నిస్సంకా, మిషార, కుషాల్ మెండిస్ లు కనీసం రెండంకెల స్కోర్ చేయలేదు.  మిడిల్ ఆర్డర్ లో మొదటగా వచ్చిన రత్నాయకే డక్ అవుట్ అయ్యాడు.

వెల్లలాగే 10 పరుగులు, కమిందు మెండిస్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేసిన కెప్టెన్ శనకా టాప్ స్కోరర్.  తీక్షణ 10 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

చివరకు శ్రీలంక 16.4 ఓవర్ల లో 95 పరుగులకు అల్ అవుట్ అయింది.  51 పరుగుల తేడాతో సొంత గడ్డ పై శ్రీలంక ఘోర పరాజయాన్ని చవి చూసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ మూడు వికెట్ లు తీయగా, ఆర్చర్, డాసన్, రషీద్ లు తలా రెండు వికెట్లు తీయగా, ఓవర్టన్ కు ఒక వికెట్ దక్కింది

అంతకు ముందు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్ల లో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 

ఫామ్ లేని బట్లర్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఆ తరవాత వచ్చిన బెథెల్ 3 పరుగులు, బాంటన్ 6 పరుగులు చేసిన వెంట వెంటనే అవుట్ అవడంతో 49 పరుగులకే మూడు వికెట్ లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాలో పడింది

అయితే కెప్టెన్ హరీ బ్రూక్ వచ్చిన వచ్చిన తరవాత క్రీజ్ లో కుదురుకుంటున్నాడనుకునే లోపు 14 పరుగులు చేసిన బ్రూక్ అవుట్ అయ్యాడు.  కాసేపటికే సామ్ కరన్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఓపెనర్ వచ్చిన ఫిల్  సాల్ట్ 40 బంతుల్లో 62 పరుగులు చేసి భారీ షాట్ కోసం ప్రయత్నించి ఆరవ వికెట్ గా వెను తిరిగాడు. ఆఖర్లో విల్ జాక్స్ నాలుగు బౌండరీలతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

శ్రీలంక బౌలర్ల లో స్పిన్నర్ వెల్లగే మూడు వికెట్లు తీయగా, తీక్షణ, మధుశనక లు చెరో  రెండు వికెట్ లు తీయగా,  చమీర కు ఒక వికెట్ దక్కింది