‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీని ప్రకటించిన సమంత

by | Feb 22, 2026 | సినిమా

సమంత (Samantha) నిర్మాతగా గారి ఇంతకు ముందు శుభం అనే మూవీ ని నిర్మించారు.  ఈ సినిమాలో సమంత ఒక ప్రత్యేక పాత్రలో కూడా నటించారు శుభం సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది.

ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది.   ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) పై సమంత నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకురాలు.  గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) టీజర్ ట్రైలర్ లో సమంత నటన చూసి ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా. మా ఇంటి బంగారం సినిమాలో అణకువ కలిగిన ఒక ఇంటి కోడలిగా, మరో వైపు యాక్షన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో సమంత విశ్వ రూపం చూపించనున్నారు.  మా ఇంటి బంగారం సినిమా సీనియర్ నటీమణులు గౌతమీ, శ్రీ లక్ష్మి లు ప్రధాన పాత్రలలో నటించారు

యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న మా ఇంటి బంగారం సినిమా మే 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు సమంత (Samantha) ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. సమ్మర్ విడుదలవబోతోన్న మా ఇంటి బంగారం సినిమా టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా, సమంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ.