పూరి లాంటి దర్శకుడు దేశంలోనే లేడు…. ప్రభాస్

by | Feb 21, 2026 | సినిమా

పూరి లాంటి దర్శకుడు దేశంలోనే లేడు.. నాకు పిచ్చెక్కిపోయింది: ప్రభాస్

ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే ట్యాగ్‌తో ఎదిగిన పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో పూరీ చేసిన సినిమాల‌న్నీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. అయితే పూరీకి సక్సెస్ తెచ్చుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆయన సాధించిన విజయాలను ఓసారి గుర్తు చేసుకుంటే ఆ హైప్ మళ్లీ తిరిగి వస్తుంది. తాజాగా అలాంటి హైప్ ను పూరి జగన్నాథ్ కు ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) . తనకు కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ ఇచ్చిన దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan) హీరోగా నటించిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ (Couple Friendly) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ప్రభాస్. ఈ క్రమంలోనే డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌పై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

పూరి జగన్నాథ్ తరహాలో హీరో క్యారెక్టర్‌ రాయగల దర్శకుడు మనదేశంలోనే లేడు. నా కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ‘బుజ్జిగాడు’లో చేశాను. పూరి ఆ క్యారెక్టర్‌ గురించి చెప్పగానే ఎలా చేయాలా అని భయపడ్డాను. నిజానికి బుజ్జిగాడు మూవీకి రాసిన క్యారెక్టరైజేషన్‌ చూసి నాకు పిచ్చెక్కిపోయింది. ఇక ఏక్ నిరంజన్‌లో కూడా నా రోల్ ఇంకా డిఫరెంట్‌గా అనిపించేది. ఆ పాత్రను ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలపై చాలా ఆలోచించేవాడిని. ఎక్ నిరంజన్‌లో ఏంటి మగాళ్లు ఏడుస్తారా? ఏంటి ఎవరైనా ఏడుస్తారని రాయడం నాకు భలే అనిపించింది. ఈ డైలాగ్‌ను హిందీలో దబాంగ్‌ సినిమాలో కూడా అడిగి మరీ వాడుకున్నారు. ఆ మూవీలో డైలాగ్స్, పూరి గారి రైటింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తనలాంటి రైటింగ్ మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎవరి వల్ల కాదు అంటూ పూరీని ఆకాశానికెత్తారు ప్రభాస్. ఇక పాన్ వరల్డ్ హీరోగా ఎదిగిన ప్రభాస్, పూరీ గురించి చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ మాటలతో పూరికి, ఆయన అభిమానులకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్లు అయింది.. గతంలో వరుస హిట్‌లతో ట్రెండ్ సెట్ చేసిన పూరీ జ‌గ‌న్నాథ్‌ నుంచి మళ్లీ ఓ సాలిడ్ కమ్‌బ్యాక్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.పూరి లాంటి దర్శకుడు దేశంలోనే లేడు.. నాకు పిచ్చెక్కిపోయింది: ప్రభాస్

ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే ట్యాగ్‌తో ఎదిగిన పూరీ జగన్నాథ్ గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో పూరీ చేసిన సినిమాల‌న్నీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. అయితే పూరీకి సక్సెస్ తెచ్చుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆయన సాధించిన విజయాలను ఓసారి గుర్తు చేసుకుంటే ఆ హైప్ మళ్లీ తిరిగి వస్తుంది. తాజాగా అలాంటి హైప్ ను పూరి జగన్నాథ్ కు ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌. తనకు కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ ఇచ్చిన దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ప్రభాస్. ఈ క్రమంలోనే డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌పై ప్రభాస్ (Prabhas) ప్రశంసల వర్షం కురిపించాడు.

పూరి జగన్నాథ్ తరహాలో హీరో క్యారెక్టర్‌ రాయగల దర్శకుడు మనదేశంలోనే లేడు. నా కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ‘బుజ్జిగాడు’లో చేశాను. పూరి ఆ క్యారెక్టర్‌ గురించి చెప్పగానే ఎలా చేయాలా అని భయపడ్డాను. నిజానికి బుజ్జిగాడు మూవీకి రాసిన క్యారెక్టరైజేషన్‌ చూసి నాకు పిచ్చెక్కిపోయింది. ఇక ఏక్ నిరంజన్‌లో కూడా నా రోల్ ఇంకా డిఫరెంట్‌గా అనిపించేది. ఆ పాత్రను ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలపై చాలా ఆలోచించేవాడిని. ఎక్ నిరంజన్‌లో ఏంటి మగాళ్లు ఏడుస్తారా? ఏంటి ఎవరైనా ఏడుస్తారని రాయడం నాకు భలే అనిపించింది. ఈ డైలాగ్‌ను హిందీలో దబాంగ్‌ సినిమాలో కూడా అడిగి మరీ వాడుకున్నారు. ఆ మూవీలో డైలాగ్స్, పూరి గారి రైటింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తనలాంటి రైటింగ్ మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎవరి వల్ల కాదు అంటూ పూరీని ఆకాశానికెత్తారు ప్రభాస్. ఇక పాన్ వరల్డ్ హీరోగా ఎదిగిన ప్రభాస్, పూరీ గురించి చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ మాటలతో పూరికి, ఆయన అభిమానులకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్లు అయింది.. గతంలో వరుస హిట్‌లతో ట్రెండ్ సెట్ చేసిన పూరీ జ‌గ‌న్నాథ్‌ నుంచి మళ్లీ ఓ సాలిడ్ కమ్‌బ్యాక్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలాఉంటే.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.