విశ్వక్ ‘కల్ట్‌’ టీజర్‌.. మరీ ఇంత వైలెంట్‌గా.!

by | Feb 21, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో ‘ఫలక్‌నుమా దాస్‌’ ‘దాస్‌ కా ధమ్కీ’ చిత్రాలతో దర్శకుడిగా, రచయితగా కూడా ఆకట్టుకున్నారు యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) . ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘కల్ట్‌’ (Cult) . ఇందులో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తారక్‌ సినిమాస్‌ పతాకంపై సందీప్‌ కాకరాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) డైలాగ్స్‌ అందిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు మేకర్స్. ఈ టీజర్ (Teaser) బట్టి చూస్తే ఓ ముగ్గురు యువకులు గోవాకి వెళ్తారు. అయితే పబ్‌లోకి వెళ్లేందుకు వారికి ఎంట్రీ దొరకదు. దీంతో ‘కల్ట్’ (Cult) అనే చోటుకి వెళ్తారు. అక్కడ లోపల ఉన్నవాళ్లందరికీ కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటుంది. అందులో ఎలిమినేట్ అయినవారిని చంపేస్తుంటారు. దాంతో పరిస్థితులు భయానకంగా మారుతాయి. ఈ క్రమంలో సడెన్‌గా విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత ఫైట్‌ సీన్‌ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. మరి ఈ ‘కల్ట్’ సినిమా సంగతేంటి అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక ఈ టీజ‌ర్‌ను చూస్తే ఔట్ అండ్ ఔట్ రా ర‌స్టిక్‌, బోల్డ్‌గా తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్టంగా తెలిసిపోతుంది. శృతిమించిన హింసాత్మ‌క స‌న్నివేశాలు, హై లెవ‌ల్ యాక్షన్ సీన్స్ తో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.