‘బైకర్’ బిజినెస్ క్లోజ్.. శర్వా రేంజ్ మాములుగా లేదుగా.!

by | Feb 21, 2026 | సినిమా

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్‌ (Sharwanand) హీరోగా దర్శకుడు అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘బైకర్’. (Biker) ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ (UV Creations) బ్యాన‌ర్‌లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్ప‌లపాటి ప్ర‌మోద్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ డాక్ట‌ర్ రాజశేఖ‌ర్ (Rajasekhar) ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. బ్ర‌హ్మాజి, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో రిటైర్ అయిన బైక‌ర్‌గా రాజ‌శేఖ‌ర్ క‌నిపించ‌గా ఆ పై శ‌ర్వానంద్‌కు కోచ్ పాత్ర చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ‘బైకర్’ (Biker) మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.23 కోట్ల భారీ మొత్తానికి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు (Dil Raju) సొంతం చేసుకున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ. 35 కోట్లకు అమ్ముడ‌య్యాయ‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) రూ.27 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఆడియో రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తమే నిర్మాత‌ల‌కు ముట్టింద‌ని స‌మాచారం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇది పెద్ద డీల్‌ అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ లెక్కలు చూస్తుంటే శర్వానంద్ మేనియా ఏ విధంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటివరకు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో శర్వానంద్ చేసిన సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచిన నేపథ్యంలో ‘బైకర్’ (Biker) కూడా అదే విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరగా, ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట మేకర్స్.