‘ధురంధర్‌ 2’కు లైన్ క్లియర్ చేసిన’టాక్సిక్‌’

by | Feb 20, 2026 | సినిమా

‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1, కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్‌ (Yash) . ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’.(Toxic) ఇందులో కియారా అద్వానీ, న‌య‌న‌తార (Nayanathara) , రుక్మ‌ణీ వ‌సంత్ (Rukmini Vasanth) , హుమా ఖురేషి, తార సుతారియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రం మార్చి 19న విడుద‌ల కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ‘టాక్సిక్‌’ మూవీ మార్చి 19న విడుదల కానుండగా.. అదేరోజు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్‌ ధురంధర్‌ మూవీ సీక్వెల్ ‘ధురంధర్‌ 2’ (Durandhar) విడుదల కానుంది. అంతకుముందు ధురంధర్‌ సినిమా గత ఏడాది బాక్సాఫీస్‌ వద్ద సంచనాల్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. దీంతో మార్చి 19న ఈ రెండు చిత్రాల మ‌ధ్య‌ బాక్సాఫీస్ వద్ద భీకరమైన పోటీ తప్పదని సినీ విశ్లేషకులు భావించారు.

అయితే తాజాగా విడుదలైన టాక్సిక్ టీజర్‌పై (Teaser) మిశ్రమ స్పందన లభిస్తోంది. విజువ‌ల్స్‌, టేకింగ్ ఆశించిన స్థాయిలో లేవని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. అంతేగాక శృతిమించిన హింసాత్మ‌క స‌న్నివేశాలతో పాటుగా సినిమాలో ఐదుగురు కథనాయుకలు ఉన్న‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రి ఉనికి కూడా టీజ‌ర్‌లో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం షాక్ గా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలలో కూడా కొత్తదనం ఏమి లేదు. దీంతో టీజ‌ర్‌పై నెటిజన్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. ఈ క్రమంలోనే ‘టాక్సిక్’ టీజర్ (Toxic Teaser) చూశాక ఈ సినిమాతోనా ‘ధురంధర్ 2’ తో పోటీకి రావడానికి సిద్ధపడ్డారు అంటూ నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ టీజర్ కు వస్తున్న నెగిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే మార్చి 19న ‘ధురంధర్ 2’ కి పాన్ ఇండియా స్థాయిలో రూట్ క్లియర్ చేసినట్టే అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ మించి ‘టాక్సిక్’ కథలో బలం ఉంటే తప్ప ‘ధురంధర్ 2’తో పోటీలో నిలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ‘ధురంధర్’ (Durandhar) సినిమా మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాను ‘టాక్సిక్’ ఏ మేరకు ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.