అంచనాలు లేకుండా వచ్చి, ఓటమి లేకుండా సూపర్ 8 లో జింబాబ్వే

by | Feb 19, 2026 | క్రీడలు

అంచనాలు లేకుండా వచ్చి ఓటమి లేకుండా సూపర్ 8 లో జింబాబ్వే ; కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా కు షాక్ ఇచ్చిన జింబాబ్వే, ఈ రోజు శ్రీలంక కు కూడా షాక్ ఇచ్చింది

T20 World Cup ప్రారంభమైనప్పుడు జింబాబ్వే పై ప్రత్యేకంగా ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచ కప్ బరిలో దిగిన జింబాబ్వే 2023 ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను గ్రూప్ దశలో  ఓడించి టోర్నమెంట్ నుండి నిష్క్రమించేలా చేసింది జింబాబ్వే.

మళ్ళీ ఈ రోజు సూపర్ ముందు శ్రీలంక కు పెద్ద షాక్ ఇచ్చింది జింబాబ్వే. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నిస్సంక 41 బంతుల్లో 62 పరుగులు, రత్నాయకే 25బంతుల్లో 44 పరుగులు చేశారు.

శ్రీలంక విసిరిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.  జింబాబ్వే ఓపెనర్ బెన్నెట్  48 బంతుల్లో 63 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మరుమని 34 పరుగులు చేశాడు. బర్ల్ 12 బంతుల్లో 23 పరుగులు చేయగా, కెప్టెన్ సికిందర్ రాజా 26 బంతుల్లో 45 పరుగులు చేశాడు 

ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లు గెలిచి, ఒక మ్యాచ్ రద్దు కావడం ద్వారా 7 పాయింట్లతో గ్రూప్ బి లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది జింబాబ్వే.

ప్రతి గ్రూప్ లో ఒక జట్టు, ఒక మ్యాచ్ కూడ ఓడిపోకుండా సూపర్ 8 కు చేరుకుంది. గ్రూప్ ఎ లో భారత జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడితే నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది. అలాగే గ్రూప్ సి లో వెస్ట్ ఇండీస్ నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది.  గ్రూప్ డ్ లో సౌత్ ఆఫ్రికా కూడా ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది