‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న అదిరిపోయే సర్​ప్రైజ్

by | Feb 17, 2026 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. (Peddi) బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) , సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకోంటుంది.

ఇదిలాఉంటే.. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు సాన పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే దర్శకుడితో సెట్స్ లో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. అయితే తాజాగా ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్‌ దర్శకుడు బుచ్చి బాబుకి పుట్టినరోజు కానుక ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే శివరాజ్‌కుమార్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి “థ్యాంక్‌ యూ సో మచ్‌ ఫర్ లవ్‌లీ గిఫ్ట్ సార్” అంటూ బుచ్చిబాబు సాన (Buchibabu Sana) క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గ‌తంలో ఎప్పుడు క‌నిపించ‌ని పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌బోతున్న‌ట్టు సమాచారం. అలాగే ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ రెండో చిత్రంపై మెగా అభిమానులతో పాటుగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.