T20 World Cup 2026 :  లీగ్ దశలోనే ఆస్ట్రేలియా అవుట్

by | Feb 17, 2026 | క్రీడలు

T20 World Cup లో లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 21 నుండి సూపర్ 8 మ్యాచ్ లు (Super 8 Matches) ప్రారంభమవుతాయి.

అయితే, 50 ఓవర్ల ఫార్మట్ లో ఆరు సార్లు ప్రపంచ కప్ ను గెలుచుకున్న ఏకైక జట్టు ఆస్ట్రేలియా. 2023 ప్రపంచ కప్ ఛాంపియన్ కూడా అయిన ఆస్ట్రేలియా 2026 టి 20 వరల్డ్ కప్ లో జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో ఓడి పోవడంతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

ఈ రోజు ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మ్యాచ్ లో ఐర్లాండ్ గెలిస్తే ఆస్ట్రేలియా కు అవకాశాలు ఉండేవి.  అయితే ఈ రోజు ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం తో ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు చెరొక పాయింట్ లభించింది

గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ దేశాలు ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్ లు గెలిచి 6 పాయింట్లతో శ్రీలంక అగ్ర స్థానంలో ఉంది.  ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు గెలిచి, ఒక మ్యాచ్ రద్దు కావడంతో 5 పాయింట్లతో జింబాబ్వే రెండవ స్థానంలో ఉంది

ఇంకా ఆస్ట్రేలియా, ఓమన్ తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.  ఆ మ్యాచ్ లో గెలిచినా ఆస్ట్రేలియా జట్టుకు మొత్తంగా నాలుగు పాయింట్లు  మాత్రమే ఉంటాయి. జింబాబ్వే కు ఇప్పటికే ఐదు పాయింట్లు ఉన్నాయి. ఇంకా శ్రీలంకతో ఆడాల్సి ఉంది.  శ్రీలంక తో మ్యాచ్ లో ఓడినా, ఇప్పటికే జింబాబ్వే సూపర్ 8 కు అర్హత సాధించింది

ఓమన్ తో మ్యాచ్ గెలిస్తే, ఆస్ట్రేలియా  కనీసం పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి వస్తుంది.  లేదంటే నాలుగవ స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది.  ప్రతి గ్రూప్ లో మొదటి రెండు స్థానాలలో ఉన్న జట్లే సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి.

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జింబాబ్వే ఆస్ట్రేలియా కు ఈ వరల్డ్ కప్ లో పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి