విజయ్ – రష్మిక పెళ్లి ఫిక్స్.. వైర‌ల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

by | Feb 16, 2026 | సినిమా

టాలీవుడ్‌ మోస్ట్ పాపులర్ జోడీల్లో ఒకటైన విజయ్ దేవరకొండ (Vijay Devara Konda) – రష్మిక మందన్న (Rashmika Mandana) పెళ్లి వార్తలు మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌ వేదికగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించగా. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కే అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ పెళ్లి పత్రిక ప్ర‌కారం వారి వివాహం ఫిబ్ర‌వ‌రి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని వివాహ పత్రికలో పేర్కొన్నారు.

ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరవుతారని సమాచారం. ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ బయటకు రావడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా కలిసి నటించిన ‘గీతా గోవిందం’, ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం మరింత బలపడిందనే టాక్ అప్పటినుంచే వినిపిస్తోంది. ప్రస్తుతం మరోసారి ఈ జంట ‘రణబాలి’ అనే ప్రాజెక్ట్‌లో కలిసి నటించబోతున్నారు. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.