మహా శివరాత్రి స్పెషల్ ‘నాగబంధం’ టీజర్ విడుదల

by | Feb 15, 2026 | సినిమా

పెదకాపు సినిమాలో నటించిన విరాట్ కర్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం నాగబంధం (Naga Bandham).  జగపతి బాబు, ఐశ్వర్య మీనన్,నభా నటేష్ లు కీలక పాత్రలలో నటించారు

ఈ రోజు మహా శివ రాత్రి (Maha Shiva Ratri) సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చేతుల మీదుగా నాగబంధం టీజర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు

సమ్మర్ లో విడుదల కానున్న ఈ భారీ చిత్రానికి అభిషేక్  నామ దర్శకత్వం వహించారు. ఈ టీజర్ ను వరల్డ్ అఫ్ నాగబంధం (World of Naga Bandham) పేరుతో విడుదల చేశారు. టీజర్ దైవ సంబంధమైన అంశాలతో చాలా బాగుంది. మీరు చూసేయండి

నిక్ పిక్చర్స్, అభిషేక్ పిక్చర్స్ లు సంయుక్తంగా నాగబంధం చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  నాగబంధం చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కధ, స్క్రీన్ ప్లే ను కూడా సమకూర్చారు అభిషేక్ నామ.