తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) కథానాయకుడిగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’ (Jailer) . రజనీ ఇందులో ముత్తువేల్ పాండియన్‌గా శక్తిమంతమైన పాత్రలో స్టైలిష్ లుక్‌తో కనువిందు చేయనున్నారు. ఈ సీక్వెల్లో బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ కూడా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక జైలర్ మొదటి భాగంలో రమ్యకృష్ణ (Ramya Krishna) , వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్ , శివరాజ్ కుమార్ , తమన్నా కీలక పాత్రల్లో నటించగా.. రెండో భాగంలో శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ పాత్రలు రిపీట్ కానున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
మొదట జూన్ 12న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా… పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా విడుదల తేదీ వాయిదా పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఆగస్ట్ 21 ఈ సినిమా విడుదలైతే గనుక బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రోజున నేచరల్ స్టార్ నాని (Natural Star Nani) నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా కూడా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇక రెండు సినిమాలు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందినవైనా, బాక్సాఫీస్ వసూళ్ల పరంగా గట్టి పోటీ నడుస్తోంది. నాని తొలిసారి పాన్ వరల్డ్ స్థాయిలో చేస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్లో ‘ది ప్యారడైజ్’పై భారీ హైప్ ఏర్పడింది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలైతే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల యుద్ధం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

