‘AA22 x A6’ – అట్లీ ప్రాజెక్ట్‌పై అల్లు అర్జున్ ఫుల్ సీరియ‌స్!

by | Feb 15, 2026 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడుగా, తమిళ అగ్ర దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 800 కోట్ల భారీ వ్యయంతో సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ‘AA22 x A6’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, దీనిపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. విజువల్ వండర్‌గా, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుందనే టాక్ నడుస్తున్నప్పటికీ, తాజాగా ఈ మూవీపై మరో టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే నెమ్మదిగా సాగుతుండడంతో అల్లు అర్జున్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందా లేదా అనే టెన్షన్ లో అల్లు అర్జున్ (Allu Arjun) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చిత్రనిర్మాతలతో పాటుగా దర్శకుడు అట్లీతో మాట్లాడిన బన్నీ ప్రాజెక్ట్ ను మరింత పకడ్బందీగా రూపొందించాలని అలాగే షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేయాలని కాస్త గట్టిగానే తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా.. ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించలేదు. ఇదిలాఉంటే.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanaga Raj) తో కూడా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.