వెంకటేశ్- అనుదీప్ కాంబోలో క్రేజీ సర్‌ప్రైజ్‌!

by | Feb 13, 2026 | సినిమా

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ (Venkatesh) మరోసారి తన సూపర్ ఫామ్‌ను చూపిస్తూ తన కెరీర్‌లో విజయవంతంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మూవీ మొఘల్ డి.రామానాయుడు వారసుడిగా ‘కలియుగ పాండవులు’తో సినిమాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఫ్యామిలీ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ తనదైన స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే, మరో దర్శకుడికి ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారట. ఆ దర్శకుడెవరో కాదు, జాతిరత్నాలు, ఫంకీ చిత్రాలతో అభిరుచిగల దర్శకుడిగా ప్రశంసలందుకున్న అనుదీప్ కేవీ. ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో తెరకెక్కించిన ‘ఫంకీ’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అనుదీప్ తన తదుపరి చిత్రాలపై స్పందిస్తూ, వెంకటేష్ గారి కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ఇటీవలే వెంకటేష్‌ను కలిసిన అనుదీప్ (Anudeep) ఒక క‌థ‌ను వినిపించగా, ఆయన ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, కథలో కొన్ని మార్పులు చేయాలని వెంకటేష్ సూచించడంతో, ప్రస్తుతం అనుదీప్ ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పక్కాగా రూపొందించిన తర్వాత మరోసారి వెంకటేష్ తో స్టోరీ డిస్కషన్ చేయాలని అనుదీప్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కూడా దర్శకుడు అనుదీప్ గత సినిమాల తరహాలోనే కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ తో చేస్తున్న చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsa Kutumbam) మూవీ పూర్తి అయ్యాక ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం.