‘వారణాసి’ సినిమా జోనర్‌ ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

by | Feb 13, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. మహేశ్‌బాబు ఇందులో రుద్ర (Rudra) అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. ఇక కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా, క‌థ విజయేంద్ర ప్రసాద్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా రాజమౌళి – మహేష్ బాబు (Mahesh Babu) ఇద్దరు ఎలాంటి జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటూ ఇండస్ట్రీ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తుంది. ‘వారణాసి’ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత పెరిగింది. కొంతమంది ఈ సినిమాను ఫిక్షన్‌ అని అంటున్నారు. మరికొంత మంది ఆటోమేటిక్ వీల్ చైర్ లో విలన్‌ ‘కుంభ’గా నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్‌లుక్‌ చూసి సైన్స్ ఫిక్షన్‌ మూవీ అని పేర్కొంటున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్‌పై అభిమానుల్లో ఎక్కడలేని టెన్షన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి ఆ సస్పెన్స్‌కు పుల్‌స్టాప్‌ పెట్టేశాడు.

తాజాగా వారణాసి (Varanasi) సినిమా జానర్‌పై రాజమౌళిని ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ‘వారణాసి’ సినిమాలో సైన్స్ ఫిక్షన్‌ ఫీల్ ఉన్నా కూడా.. ఇది ఆ జానర్‌లో తీయడం లేదని తేల్చిచెప్పారు. ‘వారణాసి’ మూవీ ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని రాజమౌళి (Rajamouli) స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాను ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో తీసుకురావడం గురించి కూడా రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా మొత్తం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కీలక సన్నివేశాలు మాత్రమే ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌తో రాజమౌళి నుంచి మనకున్న సినిమా స్కోప్‌ థియేటర్ల ఫార్మాట్‌లోనే పర్‌ఫెక్ట్ ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ గా ‘వారణాసి’ (Varanasi) సినిమా రాబోతుందని అర్థమవుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.