నమీబియాతో మ్యాచ్ : చివరి 4 ఓవర్ల లో 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు
T20 World Cup : భారత, నమీబియా జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన నమీబియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్ల లో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ఓపెనర్ గా వచ్చాడు
ఓపెనర్ సంజు శాంసన్ ధాటిగా ఆడి 8 బంతుల్లో 22 పరుగులు (మూడు సిక్సర్లు, ఒక ఫోర్) చేశాడు. రెండవ వికెట్ కు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ లు 79 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 61 పరుగులు ( 5 సిక్సర్లు , 6 ఫోర్లు) చేశాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన కాసేపటికే 25 పరుగులు చేసిన తిలక్ వర్మ కూడా అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
అయితే ఆ తరవాత వచ్చిన శివమ్ దూబే తో కలిసి హార్దిక్ పాండ్య ఐదవ వికెట్ కు 81 పరుగులు జోడించాడు. 28 బంతుల్లో 52 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసిన హార్దిక్ పాండ్య, 23 పరుగులు చేసిన శివమ్ దూబే వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత మరో నాలుగు పరుగులు జోడించి మూడు వికెట్లను కోల్పోయింది భారత జట్టు.
చివరి నాలుగు ఓవర్ల లో భారత జట్టు 25 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. నమీబియా బౌలర్ ఎరాస్మస్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా ఎరాస్మస్ నాలుగు ఓవర్ల లో 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు

