ఎట్టకేలకు ‘ది ప్యారడైజ్‌’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

by | Feb 12, 2026 | సినిమా

టాలీవుడ్‌ నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా రాబోతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) . టాలెంటెడ్ డైరెక్టర్ ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మోహన్‌ బాబు, తనికెళ్ల భరణీ, కిల్‌ ఫేం రాఘవ్‌ జుయల్‌ సంపూర్ణేష్ బాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా కయాదు లోహర్ కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో నాని తల్లి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని ‘జడల్’ (Jadal) అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా కోసం నాని (Nani) అభిమానుల‌తో పాటు సినీ ప్రేమికులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. షూటింగ్‌ ఆలస్యమవుతున్న కారణంగా ముందుగా ప్రకటించినట్లుగా మార్చి 26న సినిమా వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అన్నట్లు మేకర్స్ కూడా ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) మూవీ మార్చి 26న రావడం లేదని అధికారికంగా ప్రకటించారు. మార్చి 26 నుంచి తప్పుకొని ఆగస్ట్ 21న ‘ది ప్యారడైజ్‌’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుందని కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈసారి మాత్రం పక్కాగా ‘ది ప్యారడైజ్‌’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. అయితే ఐదు నెలలు ఆలస్యంగా వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్‌’ అరాచకం అలాగే ఉంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి ఈ సినిమాతో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.