టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2026(Filmfare Awards 2026) పురస్కారాలకు పోటీపడుతున్న సినిమాల జాబితాను ఫిలిం ఫేర్ తాజాగా విడుదల చేసింది. అవార్డ్ రేసులో ఉన్న నటీనటుల జాబితాతో పాటు సినిమాల లిస్ట్ ను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం నేతృత్వంలో ఫిబ్రవరి 21న ఈ వేడుకు అంగరంగ వైభవంగా జరగనుంది. దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2024లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన చిత్రాల మధ్య ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ బరిలో గట్టి పోటీ నెలకొంది. మొత్తంగా ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ నామినేషన్లు దక్షిణాదితో పాటు ప్రపంచ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఎవరి చేతికి అవార్డులు చేరతాయన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఫిబ్రవరి 21న ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుండగా ఈసారి అవార్డుల కోసం నామినేషన్స్ లో పోటీపడుతున్న చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఎలా ఉన్నాయంటే..
ఉత్తమ నటుడు
అల్లు అర్జున్ (పుష్ప-2) Allu Arjun (Pushpa2)
దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
ఎన్టీఆర్ (దేవర) NTR (Devara)
నాని (సరిపోదా శనివారం)
సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)
తేజ సజ్జా (హనుమాన్) Teja Sajja (Hanuman)
ఉత్తమ నటి
అనుపమ పరమేశ్వరణ్ (టిల్లు స్క్వేర్)
అషికా రంగనాథ్ (నా సామిరంగా)
మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
నివేథా తామస్ (35 చిన్న కథ కాదు)
ప్రియాంక మోహన్ ( సరిపోదా శనివారం)
రష్మిక మందన్న (పుష్ప-2) Rashmika Mandana
ఉత్తమ చిత్రం
హను-మాన్
పుష్ప-2
కల్కి 2898AD
లక్కీ భాస్కర్
35 చిన్న కథ కాదు
కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ దర్శకుడు
నాగ్ అశ్విన్ (కల్కి 2898AD)
సుకుమార్ (పుష్ప-2)
ప్రశాంత్ వర్మ (హను-మాన్)
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ సహాయ నటుడు
అమితాబ్ బచ్చన్ (కల్కి 2898AD)
ఫహద్ ఫాజిల్ (పుష్ప-2)
సత్య ( మత్తు వదలరా-2)
ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
వినయ్ రాయ్ (హనుమాన్)
ధనజయ (జీబ్రా)
ఉత్తమ సహాయ నటి
అంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
ఫరియా అబ్దుల్లా ( మత్తు వదలరా-2)
రాశి సింగ్ నందు ( ప్రసన్న వదనం)
శరణ్య ప్రదీప్ ( అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
శ్రద్ధా శ్రీనాథ్ ( మేకానిక్ రాఖీ)
వరలక్ష్మీ శరత్‌కుమార్ (హనుమాన్)
ఉత్తమ సంగీత దర్శకుడు
అనిరుధ్ రవిచంద్రన్ (దేవర)
దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-2)
తమన్ (గుంటూరు కారం)
జీవీ ప్రకాష్ కుమార్ ( లక్కీ భాస్కర్)
చైతన్ భరద్వాజ్ (హరోం హర)
జేక్స్ బెజోయ్ ( సరిపోదా శనివారం)
గౌర హరి , అనుదీప్ దేవ్ , కృష్ణ సౌరభ్ (హనుమాన్)
ఉత్తమ గేయ రచయిత
రామజోగయ్య శాస్త్రి ( చుట్టమల్లే- దేవర)
రామజోగయ్య శాస్త్రి ( ధమ్ మసాల- గుంటూరు కారం)
రామజోగయ్య శాస్త్రి ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)
కృష్ణ కాంత్ (ఆ రోజులు మళ్లీ రావు- కమిటీ కుర్రోళ్లు)
శ్రీమణి (శ్రీమతి గారు- లక్కీ భాస్కర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు
అనిరుధ్ రవిచందర్ (ఫీయర్ సాంగ్- దేవర)
అనురాగ్ కులకర్ణి (సుట్టంలా సూసి – గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
అర్జిత్ సింగ్ (అణువణువు- ఓం భీమ్ బుష్)
గౌర హరి (పూలమ్మే పిల్ల- హనుమాన్)
రామ్ మిరియాల (సుఫియాన- ఆయ్)
సంజీత్ హెగ్డే (ధమ్ మసాల- గుంటూరు కారం)
శ్రీ కృష్ణ ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)
ఉత్తమ నేపథ్య గాయని
శిల్పి రావ్ (చుట్టమల్లే- దేవర)
మంగ్లీ (గుల్లెడు గుల్లెడు గులాబీలు- మెకానిక్ రాఖీ)
శ్రెయా ఘోషల్ (సూసేకి- పుష్ప-2)
ఉషా ఊతప్ (లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్)


