ఎక్స్క్లూజివ్: అల్లు అర్జున్ 42 నిబంధనలు ఇవేనా!?

by | Feb 11, 2026 | సినిమా

తెలుగు చిత్ర సీమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి వార్తల్లో నిలిచారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ‘పుష్ప’ (Pushpa) ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్‌పై తాజాగా వచ్చిన ‘ప్రోటోకాల్’ వివాదం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. తాజాగా కావేరీ బారువా (Kaveri Barua) అనే బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌తో ప్రకటనల్ని చిత్రీకరించేటప్పుడు 42 రకాల నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం చర్చనీయాంశం కావడంతో అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవాస్తవమని కొట్టిపారేసింది. అల్లు అర్జున్‌ (Allu Arjun) ఎంతో హుందాగా ఉంటారని, అందరితోనూ ఎంతో గౌరవప్రదంగా మెలుగుతుంటారని, ఆయనపై ప్రచారమవుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

అయితే తాజాగా అల్లు అర్జున్ టీమ్ ఇచ్చిన 42 నిబంధనల నోట్ ఇదే అంటూ ఒక నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా చెప్పిన కొన్ని రూల్స్ ఈ లిస్ట్ లో ఉండటంతో ఇది అల్లు అర్జున్ టీమ్ ఇచ్చిన నోట్ అని కొందరు భావిస్తున్నారు. బన్నీ టీమ్ పెట్టిన ఆ నిబంధనల జాబితాలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే.. అందులో అల్లు అర్జున్ కళ్లలోకి నేరుగా చూడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో షేక్‌హ్యాండ్ చేయకూడదు, సెట్స్ లో అనుమతి లేకుండా మాట్లాడకూడదు, అల్లు అర్జున్ కు కనీసం మూడు అడుగుల దూరంలో నిల్చోవాలి, అల్లు అర్జున్ (Allu Arjun) ను స్టైలిస్ట్ స్టార్ అని కాకుండా ఐకాన్ స్టార్ అని మాత్రమే పిలవాలి, అల్లు అర్జున్ కంటికి ఇబ్బంది కలిగే రంగుల దుస్తులు ధరించకూడదు, అల్లు అర్జున్ గదిలోకి రాగానే లేచి నిలబడాలి, ఫోన్ మాట్లాడకోడదు, ఫ్యాన్స్‌లా ఆటోగ్రాఫ్స్, సెల్ఫీలు అడగకోడదు, అల్లు అర్జున్ ఉన్నప్పుడు చేతులు జేబులో పెట్టుకోవద్దు, అలాగే వీపు చూపిస్తు నడవకూడదు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఉన్నపుడు ఇతర టాలీవుడ్ నటీనటులు గురించి చర్చించవద్దు అనే అంశాలు ఇందులో ఉన్నాయి. మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న 42 రూల్స్ నోట్ (42 Rules Note) మీద అల్లు అర్జున్ టీమ్ ఎలా స్పందిస్తారో అనేది చూడాలి.